జగిత్యాల:ఈమధ్య కాలంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్న తెలిసిందే హైదరాబాద్ లో చిన్న పిల్లాడిని చంపిన ఘటన దగ్గరనుంచి క నుంచి మొదలుకొని మహబూబ్ నగర్ చిన్న పిల్లను కరిచి చంపినా ఘటన వరకు కుక్కలు దాడిచేస్తున విషయం తెలిసిందే అయితే మైతాపూర్ గ్రామంలో 40 కుక్కలను కర్రలతో కొట్టి చంపారు .
చంపిన గుర్తు తెలియని వ్యక్తుల గుంపు కోసం రాయికల్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన అదులాపురం గౌతమ్ అనే జంతు కార్యకర్త సోమవారం ఫిర్యాదు చేశారు.
జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960లోని సెక్షన్ 11(1) కింద వారు కేసు నమోదు చేశారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, వీధి కుక్కల కోసం గర్భనిరోధక చర్యలను ప్రారంభించేలా స్థానిక సంస్థలను ఒప్పించాలని గౌతమ్ అన్నారు.
గతంలో హైదరాబాద్‌లోని అంబర్‌పేట పరిధిలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన అందరి గుండెలను మెలిపెడుతోంది. సీసీ కెమెరాల్లో రికార్డైన దాడి దృశ్యాలు చూస్తుంటే.. ఒళ్లు గగుర్పాటుకు గురికాక తప్పదు. ఆ దాడి సమయంలో.. కుక్కలు చుట్టుముట్టినప్పుడు ఆ చిన్నారి ఎంతగా రోదించిందో చెక్కర్లేదు .
Share your comments