News

రైతులకు శుభవార్త :తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం ..

Srikanth B
Srikanth B
Paddy procurement in Telangana started on 11 April
Paddy procurement in Telangana started on 11 April

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో సోమవారం కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ యాసంగి వరి ధాన్యంపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండిం చిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరను పొందాలన్నారు.

ఇప్పటికే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉన్న కేంద్రాలలో సేకరణను ప్రారంభించాలని మంత్రులు నిన్న జరిగిన సమావేశంలో యాసంగి వడ్ల కొనుగోళ్లను మంగళవారం నుంచి ప్రారంభించాలని ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 7100 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలనీ అధికారులను ఆదేశించారు .

భారీగా పెరిగిన తెలంగాణ వ్యవసాయ ఎగుమతులు.. ఎంత అంటే?

ఈ సందర్భంగా మంత్రులు మాట్లా డుతూ ధాన్యం నిల్వ చేసేందుకు ఇంటర్మీడి యట్ కాలేజీలను గోడౌన్లుగా గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని , స్టేట్ బోర్డర్లలో చెక్ పోస్టులు సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా స్టేట్ బోర్డర్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ,ధాన్యం కొనుగోళ్లకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు రెడీ చేసుకోవాలని కలెక్టర్లును సూచించారు . అమ్మిన వడ్ల డబ్బులు రైతులకు చెల్లించడంలో లేటు కాకుండా కొనుగోలు వివరాలను ఎప్పటికప్పడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు.

తెలంగాలో ఇప్పటికే కొన్ని జిల్లాలలో కోతలు మొదలై కొన్ని సేకరణకు సిదంగా వున్నది , యాసంగి పంటను రైతుల నుంచి మొత్తం ప్రభుత్వమే సేకరించాలని మంత్రులను ఆదేశించారు .ఈ మేరకు యాసంగి పంట మొత్తాన్ని ప్రభుత్వమే సేకరించనున్నది .

భారీగా పెరిగిన తెలంగాణ వ్యవసాయ ఎగుమతులు.. ఎంత అంటే?

Share your comments

Subscribe Magazine