News

పీఎం కిసాన్ పథకంలో ఉన్నారా..? అయితే ఈ ఐదు విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి

KJ Staff
KJ Staff
pm kisan scheme
pm kisan scheme

ప్రధాని నరేంద్ర మోదీ గత లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన అత్యంత ముఖ్యమైన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ఇదే. ఈ పథకంపై మోదీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు సమయానికి డబ్బులు జమ చేస్తుంది. రైతులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు 2018లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. ప్రస్తుతం 12 కోట్ల మంది పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. మోదీ ప్రభుత్వంలో సక్సెస్ ఫుల్ అయిన పథకం ఇది.

ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం మూడు విడతల చొప్పున రైతుల అకౌంట్లలో నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తుంది. రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఇస్తుంది. అంటే సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పుున మొత్తం రూ.6 వేలు ఇస్తుంది. ఇప్పటివరకు 8 విడతల సొమ్మును రైతులకు అందించగా.. త్వరలో 9వ విడత సొమ్మును ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

అయితే 2018లో ఈ పథకం ప్రారంభించిన దగ్గరి నుంచి కేంద్రం చాలా మార్పులు చేసింది. ఈ పథకం కొత్తగా చేరాలనుకుంటున్నవారు ఆ మార్పులు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ల్యాండ్ హోల్డింగ్ లిమిట్

ఈ స్కీమ్ ప్రారంభం సమయంలో 2 హెక్టార్లు లేదా 5 ఎకరాల భూమి ఉన్నరైతులకు మాత్రమే వర్తించేలా నిబంధన పెట్టారు. కానీ ఎక్కువమంది రైతులకు పీఎం కిసాన్ క్రింద సాయం అందించేందుకు ఆ లిమిట్ ను తీసివేశారు. 5 ఎకరాలపైన భూమి ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది.

కుటుంబ నిబంధన

ఈ పథకం ప్రారంభం సమయంలో కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకం వర్తింపజేసింది. కుటుంబంలో ఇద్దరి పేర్ల మీద భూమి ఉంటే ఒకరికి మాత్రమే వర్తించేది. కానీ ఆ నిబంధనను కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. కుటుంబంలో ఇద్దరి పేర్ల మీద భూమి ఉన్నా.. ఇద్దరికి సాయం అందిస్తామని తెలిపింది.

ఆధార్ కార్డు తప్పనిసరి

ఇక ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలని నిబంధన పెట్టింది. ఆధార్ కార్డు లేకపోతే ఈ పథకంలో రిజిస్ట్రర్ చేసుకోలేరు. ఆధార్ ను తప్పనిసరి చేశారు.

సెల్ఫ్ రిజిస్ట్రేషన్ సదుపాయం

రైతులే స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దీని కోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, భూమి పత్రాలు అప్ లోడ్ చేసి రైతులే స్వయంగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టేటస్‌ను చెక్ చేసుకునే సదుపాయం

ఇక పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో.. లేదో తెలుసుకునేందుకు, ప్రభుత్వం నగదు జమ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ తెలుసుకునే సదుపాయాన్ని కేంద్రం కల్పించింది. పీఎం కిసాన్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఇప్పటివరకు ఎన్ని విడతల డబ్బులు వచ్చాయనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు, పీఎం మాన్ ధన్ యోజన

పీఎం కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయం కల్పించింది. పీఎం కిసాన్ స్కీమ్ తో కిసాన్ క్రెడిట్ కార్డును లింక్ చేశారు. దీని ద్వారా పీఎం కిసాన్ లబ్ధిదారులు సలువుగా కిసాన్ క్రెడిట్ కార్డు పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డు ద్వారా రూ.3 లక్షల రుణాన్ని 4 శాతం వడ్డీకే రైతులు పొందవచ్చు.

ఇక పీఎం కిసాన్ పథకంలో లబ్ధిదారులుగా ఉంటే పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. పీఎం కిసాన్ డబ్బులను నేరుగా కిసాన్ మాన్ ధన్ యోజన పథకానికి నేరుగా బదిలీ చేసుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine