దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణకు తొలిరోజే 600 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చిన కేటీఆర్.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశాల్లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలంగాణకి రూ.600 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు.అయితే ఇందులో లులూ గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబడులను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టనుంది, స్పెయిన్‌కు చెందిన కెమో ఫార్మా వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో రూ. 100 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. జ్యూరిచ్‌కు చెందిన స్విస్ రీ కంపెనీ కూడా ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
లులూ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ MA యూసఫ్ అలీ మాట్లాడుతూ ఈ యూనిట్లకు త్వరలో పునాది వేయనున్నామని, తెలంగాణ నుంచి యూరప్ తదితర దేశాలకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో పాలుపంచుకుంటామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో పాటు, నిర్మాణ రంగంలో, ముఖ్యంగా వాణిజ్య సముదాయాల్లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూప్ ఆసక్తిగా ఉంది. కంపెనీ ఇప్పటికే కొన్ని ప్రదేశాలను గుర్తించిందని, వాణిజ్య సముదాయాలను నిర్మించే కొన్ని యాజమాన్యాలతో చర్చలు జరుపుతోందని “అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో మెగా షాపింగ్ మాల్‌ను నిర్మించడమే లక్ష్యం” అని అన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా వ్యవసాయ ఆధారిత మరియు వ్యవసాయ అనుబంధ రంగ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది. లులూ గ్రూప్ పెట్టుబడి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మరింత ఊతమిస్తుందని అన్నారు.
స్పెయిన్‌కు చెందిన కెమో ఫార్మా హైదరాబాద్‌లో కొత్తగా పరిశోధన&అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించాలని చూస్తుంది.
మరిన్ని చదవండి.
Share your comments