ఆన్లైన్ గేమ్ ద్వారా కొందరు లక్షలు పోగొట్టు కుంటుంటే మరి కొందరు మాత్రం రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతున్నారు , అయితే అన్ని సార్లు అదృష్టం కలిసి రాదు ఒకరికి కోట్లు వచ్చాయని .. మీరు ఆన్ లైన్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకోవద్దు .. వాటికి దూరంగా ఉండడమే మంచిది.. అయితే కొన్నిసార్లు మాత్రం నక్క తోక తొక్కినట్లు అదృష్టం వెతుకుంటూ వస్తుంది.
మధ్యప్రదేశ్‌లోని బార్వానీ జిల్లాకు చెందిన షహబుద్దీన్ మన్సూరి ఒక డ్రైవర్. ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లో క్రికెట్ గేమ్ ఆడడం అలవాటు. రెండేళ్లుగా ఈ యాప్ ద్వారా డబ్బులు పెడుతూనే ఉన్నాడు. ఎప్పుడు డబ్బులు పెట్టిన రూ.49 కి మించి పెట్టాడు . ఎప్పుడు బెట్టింగ్ కట్టినా డబ్బులు వచ్చిన దాఖలాలు లేవు .. లక్ కలిసివస్తే బికారీ కోటీశ్వరుడు అవుతాడు. అదృష్టం కలిసిరాకపోతే కోటీశ్వరుడు రాత్రికి రాత్రే బికారీ అవుతాడు .
అయితే ఈ ఐపీఎల్ లో షహబుద్దీన్ ఒక టీం ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఈ సారి అదృష్టం అతనిని వెతుకుంటూ వచ్చింది , ఏకంగా రూ.49 కేటగిరిలో ఫస్ట్ ప్లేస్ సాధించాడు. దీంతో ఏకంగా రూ.1.5 కోట్లు దక్కాయి.
బంగారం కొనాలనుకునే వారికీ షాక్ .. భారీగా పెరిగిన ధర !
లక్ కలిసివస్తే బికారీ కోటీశ్వరుడు అవుతాడు. అదృష్టం కలిసిరాకపోతే కోటీశ్వరుడు రాత్రికి రాత్రే బికారీ అయిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ జీవితాలను తారుమారు చేస్తుంది.. వాటికి దూరంగా ఉండడమే మంచిది.. అయితే కొన్నిసార్లు కొందరి లైఫ్ కంప్లీట్ యూ టర్న్ తీసుకుంటుంది.. నక్క తోక తొక్కినట్లు లక్ వెంటపడి మరి మనల్ని చేరుకుంటుంది. రూ. 1.50 కోట్లు దక్కించుకున్న షాహబుద్దీన్ తన యాప్ వాలెట్ నుంచి రూ. 20 లక్షలు విత్ డ్రా చేసుకున్నాడు . మిగిలినవి అతని ఖాతాలో నే వున్నాయి.
Share your comments