News

బంగారం కొనాలనుకునే వారికీ షాక్ .. భారీగా పెరిగిన ధర !

Srikanth B
Srikanth B
Gold price hike
Gold price hike

భారతదేశంలో అన్నిటి కన్నా డిమాండ్ వున్నా వస్తువు ఏదైనా వుందా అంటే అది బంగారం .. జీవితం లో ప్రతి ఒక్కరు ఎదో సందర్భంలో బంగారం కొనాలని అనుకుంటారు ,ప్రత్యేకంగా హిందూ పెళ్లిళ్లలో బంగారం లేనిదే పెళ్లి జరగదు ,స్థాయిని బట్టి పెళ్లి సందర్భంలో కొద్దో గొప్పో బంగారం కొనుకుంటారు , అయితే ప్రస్తుతానికి రోజు రోజు పెరుగుతున్న ధరలతో బంగారం కొనాలనుకునే అందని ద్రాక్ష గ మారింది , పసిడి రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు ప్రస్తుతం మార్కెట్లో ఇలా ఉన్నాయి .

దేశీయంగా పసిడి పైపైకి చేరుతూ కొనుగోలుదారులకు షాకిస్తోంది. దేశంలో పలు నగరాల్లో బంగారం ధర రూ.61 వేలను దాటేసింది.అటు వెండి కూడా ఇదే బాటలో ఉంది. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 10 పెరిగి.. రూ. 55,310కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.19 పెరిగి రూ.69,340కి చేరుకుంది.

ఇది కూడా చదవండి .

పూర్తయిన సర్వే .. పంట నష్టపోయిన రైతుకు త్వరలో ఎకరానికి రూ . 10 వేలు!

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,300 గాను, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా వెయ్యి రూపాయలు ఎగిసి రూ.60,330గా ఉంది. కాగా ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,360గా ఉంది. అటు ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61, 510 గా ఉంది. ఇక హైదరాబాద్‌లో మరో విలువైన లోహం వెండి ధరలను పరిశీలిస్తే కేజీ వెండి ఏకంగా రూ.2900 పుంజుకుంది. కిలో ధర రూ.77800గా ఉంది.

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. తద్వారా ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎంసీక్స్‌ గోల్డ్ బుధవారం రూ. 61,130 వద్ద ఉంది. కిలో వెండి 3.7 శాతం ఎగిసి రూ. 74,700 కి స్థాయిని తాకింది.

ఇది కూడా చదవండి .

పూర్తయిన సర్వే .. పంట నష్టపోయిన రైతుకు త్వరలో ఎకరానికి రూ . 10 వేలు!

Related Topics

Gold loans

Share your comments

Subscribe Magazine