దేశంలో గత కొన్ని రోజులుగా మనం రోజు వాడే నిత్యవసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నిత్యవసర సరుకులను కొనాలంటేనే సామాన్యుల వెన్నులో వణుకు పుడుతుంది. ప్రస్తుతం పప్పులు, బియ్యం, ఉల్లిపాయలు, కూరగాయలు, నూనెలు వంటి నిత్యావసర ఆహార పదార్థాల ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వీటితోపాటు మనం ప్రతి పంటలో ఉపయోగించే టమాటా, పచ్చిమిర్చి వంటి వస్తువులు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి.
గత నెలలో టమాట ధర రూ.10 నుంచి రూ.20 వరకు ఉండగా, ఇప్పుడు అవి రూ.150కి విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా రూ.250 వరకు పలుకుతుంది. ఇలాంటి సమయంలో ఓ ప్రాంతంలో కిలో టమాటా కేవలం ఒక్కరూపాయికే విక్రయించారు. ఈ ధరల పెరుగుదల సగటు మరియు మధ్య-ఆదాయ కుటుంబాలను బాగా ప్రభావితం చేస్తుంది, వారిపై తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది.
ఇప్పుడు మార్కెట్లో ఉన్న టమోటా ధరలు చూస్తే చుక్కలు కనబడుతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో ఏకంగా ఒక కిలో టమోటాలను ఏకంగా రూ.150 విక్రయిస్తున్నారు. అకస్మాత్తుగా ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు టమాటా కొనాలంటేనే భయపడే పరిస్తితి నెలకొంది. వంటకాల్లో టమాటా ఖచ్చితంగా వాడుతుంటారు.
దీంతో ఎంత ఖరీదైనా తప్పనిసరి కొనాల్సి వస్తుంది. వర్షాకాల ప్రభావం టమాటా పంటలపై తీవ్రంగా చూపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి టమోటా సప్లై లేకపోవడం, మొన్న కురిసిన అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో వీటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని వ్యాపారులు చుబుతున్నారు.
ఇది కూడా చదవండి..
ఆవుపేడ టైల్స్ ! రైతులకు ధనవంతులను చేస్తున్న ఈ వ్యాపారం గురించి మీకు తెలుసా?
ఈ కష్ట తరుణంలో ప్రజల ఇబ్బందులను అర్ధం చేసుకుని తమిళనాడు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ రాజేష్ పార్టీ ఒక వినూత్న ప్రయత్నం చేసాడు. అదేమిటంటే తమ పార్టీ తరపున ఒక టన్ను టమోటాలని దిగుమతి చేసుకుని పేద ప్రజలకు అతి తక్కువ ధర కేవలం రూ.1 కే కిలో అమ్ముతున్నారు.
ఆర్ కే నియోజకవర్గంలో తండయార్ పేటలో టమాటాలను దాదాపు వెయ్యి మంది వరకు కొనుగోలు చేయడం విశేషం. ఈ సందర్బంగా టమాటా కొనుగోలు చేసిన వారందరూ అన్నాడీఎంకే కి కృతజ్ఞతలు తెలియచేశారు. కాగా, పళణిస్వామి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అన్నాడీఎంకే కార్యదర్శి రాజేష్ తెలిపారు. ప్రస్తుత ధరల పెరుగుదల మరియు నిత్యావసర వస్తువుల కొరతను ఎదుర్కోవడంలో ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను లబ్ధిదారులు గుర్తించారు. ఎఐఎడిఎంకె యొక్క ప్రయత్నాలకు వారి ప్రశంసలు అనేక కృతజ్ఞతలు మరియు ఉపశమనం యొక్క వ్యక్తీకరణలలో స్పష్టంగా కనిపించాయి.
ఇది కూడా చదవండి..
Share your comments