News

ఆవుపేడ టైల్స్ ! రైతులకు ధనవంతులను చేస్తున్న ఈ వ్యాపారం గురించి మీకు తెలుసా?

Gokavarapu siva
Gokavarapu siva

పూర్వకాలంలో ఇళ్లను నిర్మించినప్పుడు ఇంటి గోడలకు మరియు నెలకు ఆవు పేడను అలికేవారు. ప్రస్తుత కాలంలో ఇంటికి హంగులు ఆర్భాటాలు ఎక్కువ అయిపోయాయి. నేటికాలంలో ఇలా ఇంటికి ఆవుపేడను పూయడం అలాంటి పనులను పూర్తిగా మానేశారు. కానీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కొత్త తరహా ఆలోచనలు వచ్చాయి. అదేమిటంటే ఆవుపేడతో టైల్స్ తయారుచేస్తున్నారు.

అయితే, ఇప్పుడు ఆవుపేడ టైల్స్‌ రూపంలోకి వచ్చేసింది. ఈ టైల్స్‌ ను నేరుగా మీ ఇళ్లలో అమర్చుకోవచ్చు. మన ఇళ్లలో ఈ ఆవుపేడ టైల్స్ ను అమర్చడం ద్వారా వేసవి కాలంలో ఇంటికి చాలా మంచివని నిపుణులు తెలుపుతున్నారు. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విధంగా ఆవుపేడతో చేసిన టైల్స్ ఎలా ఉంటాయో అని. ఇది సరదాగా చెప్తున్నది కాదు, ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తుంది.

ఈ ఆవుపేడ టైల్స్ మనకి మార్కెట్ లోకి కూడా అందుబాటులోకి వచ్చాయి. పైగా వీటికి అంతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఆవుపేడ టైల్స్ ని అమర్చడం ద్వారా వేసవి కాలంలో మన ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. ఆవు పేడతో చేసిన టైల్స్‌ వేయడం వల్ల మీ ఇంటి అందం ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉండడమే గొప్పదనం. ఈ టైల్స్‌ను మార్కెట్‌లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతుల ద్వారా విక్రయిస్తున్నారు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యేది ఆరోజే?

ప్రస్తుతం ఈ ఆవుపేడ టైల్స్‌కు మంచి డిమాండ్ ఉండడంతో వీటిని తయారు చేసే పరిశ్రమలు కూడా బాగా పెరిగాయి. ఈ కంపెనీలు రైతుల నుండి నేరుగా ఈ ఆవుపేడను కొనుగోలు చేస్తున్నారు. ఈ ఆవు పేడను ప్రాసెస్ చేసిన తర్వాత, ఆవు పేడ టైల్స్‌ను యంత్రాల ద్వారా తయారు చేస్తారు. ఈ టైల్స్‌ పూర్తిగా సేంద్రీయమైనవి. ఛత్తీస్‌గఢ్‌ కు చెందిన మహిళలు కొన్ని రకాల పథకాల కింద ఈ ఆవుపేడ టైల్స్ ను వ్యాపారులు తయారుచేస్తున్నారు.

మన వేదాలలో మరియు పూజలును చేయడానికి ప్రజలు ఆవుపేడను అత్యంత పవిత్రమైనదిన వాడతారు. మన ఇంటికి ఈ ఆవుపేడ టైల్స్ ను అమర్చడం ద్వారా 5 నుండి 8 శాతం వరకు ఇంటి ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యేది ఆరోజే?

Related Topics

cow dung

Share your comments

Subscribe Magazine