జిల్లాలోని రామారెడ్డి మండలం అడవుల్లోని కొండపై ఉన్న భారీ బండరాయిలో పడిపోవడంతో వన్యప్రాణులను వేటాడుతున్న ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. అతడి బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో రెవెన్యూ అధికారులతో కలిసి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రెడ్డిపేట గ్రామానికి చెందిన చాడ రాజు మంగళవారం రాత్రి సమీపంలోని అడవిలో వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కొండపై ఉన్న భారీ బండలో పడిపోయాడు. అయితే ఉదయం అయినా రాజు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అడవిలో వెతకగా బుధవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
కామారెడ్డి ఎస్పీ బి శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం .. అటవీప్రాంతంలో ఉన్న భారీ బండరాయి నుంచి శబ్దాలు రావడంతో కుటుంబ సభ్యులు, ఇతర గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన శిశువులకు ,శిశు ఆధార్ కార్డుల జారీ!
సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బంది బండను నెమ్మదిగా తొలగిస్తున్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు . అతని ప్రాణానికి ఎటువంటి హాని కల్గకుండా ఉండేందుకు అవసరమైన ఆహార పదార్ధాలను అందిస్తున్నారు . ఇప్పటికి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటన స్థలంలో అగ్ని మాపక సిబ్బంది మరియు పొలిసు బృందం ఒక జేసీబీ సహాయంతో యతనిని బయటకు తీసేందుకు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి .
Share your comments