News

ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన శిశువులకు ,శిశు ఆధార్ కార్డుల జారీ!

Srikanth B
Srikanth B

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశువులకు తెలంగాణ ప్రభుత్వం శిశు ఆధార్ కార్డుల జారీని ప్రారంభించింది. దీనితో తల్లి తండ్రులకు పిల్లలకోసం ఆధార్ కార్డు ప్రక్రియ మరింత సులభం కానున్నది.

తెలంగాణలో నవజాత శిశువుల కోసం తెలంగాణ ప్రభుత్వం శిశు ఆధార్ కార్డులను మంజూరు చేస్తోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు , ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలోని ప్రభుత్వ కుటుంబ సంక్షేమ కమిషన్‌ దీన్ని చేస్తోంది . శిశు ఆధార్ కార్డు కోసం నవజాత శిశువులను నమోదు చేస్తున్నారు. ఇందుకు తల్లి ఆధార్ కార్డు, ఆధార్ నంబర్ తప్పనిసరి అని తెలిపారు. లేని పక్షంలో తండ్రి ఆధార్ కార్డు కూడా వినియోగించుకోవచ్చు.ప్రభుత్వం  దీనిని బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు జారీ చేస్తాము. తెలంగాణలో తొలిసారిగా దీన్ని ప్రారంభించారు.

గోల్కొండ ఏరియా ఆస్పత్రి డీఈవో సాయిబాబా మాట్లాడుతూ.. ‘శిశు ఆధార్ కార్డు’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే దీన్ని అమలు చేశారు. శిశువులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే ముందు ఆధార్ కార్డులను జారీ చేస్తారు. రోగుల వద్దకు వెళ్లి వారి ముందు ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్లై చేస్తున్నాం. వారు 15 రోజుల్లోగా కార్డును ఆన్‌లైన్‌లో తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వారికి 45 రోజుల్లోగా పోస్ట్ ద్వారా కార్డు అందుతుంది. కార్యక్రమం ప్రారంభించి 6 నెలలు అవుతోంది. పైలట్ ప్రోగ్రామ్‌గా మొదటి దశలో 45 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండో దశకు కూడా శ్రీకారం చుట్టింది. నవంబర్ నుండి ఈ కార్యక్రమం కింద మేము ఇప్పటికే దాదాపు 30 ఆధార్ కార్డులను జారీ చేసాము.

Share your comments

Subscribe Magazine