News

ఆంద్రప్రదేశ్ : పెరిగిన వృద్దాప్య పెన్షన్ రూ.2,750.. నేటి నుంచి అమలు ...

Srikanth B
Srikanth B
old age pension AP
old age pension AP

రాష్ట్రంలో వృద్దాప్య పెన్షన్ రూ.2,500 నుంచి రూ.2,750కు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం లభించింది . ఈమేరకు పెరిగిన పెన్షను  2023 జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రతిపాదనలను మంత్రి వర్గం సిద్ధం చేసింది . గతంలో కూడా రూ . 2250 ఉన్న పెన్షన్ ను 2500 కు పెంచింది ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగం గ రూ . 3000 పెన్షన్ అందించేవిదంగా దఫాలుగా పెన్షను పెంచుకుంటూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .

ఇందుకు కోసం నెలకు అదనంగా రూ.130.44 కోట్ల వ్యయం ఖర్చు చేయనుంది . . ప్రస్తుతం 62 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు నెలకు సుమారు రూ.1,720 కోట్లను పెన్షన్గా పంపిణీ చేస్తోంది. కొత్తగా డిసెంబర్ 2.43 లక్షల మందికి పెన్షన్ను మంజూరు చేసింది. వారితో కలుపుకుంటే వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద లబ్ధిదారుల సంఖ్య 64.74 లక్షలకు చేరుకుంది. దాంతో పెన్షన్ల కోసం ప్రభుత్వం నెలకు చేస్తున్న వ్యయం మొత్తం రూ.1,786 కోట్లకు పెరగనుంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో భాగంగా పెంచిన పెన్షన్ పంపిణీకి సంబంధించి జనవరి 1 నుంచి 7 వరకు వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వారోత్సవాల సందర్భం గ పెరిగిన పెన్షన్ పత్రాలను లబ్దిదారులకు అందించనుంది ప్రభుత్వం .

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పైనాపిల్, ఒక్కో పైనాపిల్ ధర ₹ 1 లక్ష..

ఖరీప్-2022కు సంబంధించి రాష్ట్రంలో గతంలో అమలు చేసిన సాగునీటి విడుదల షెడ్యూల్ ను విడుదల చేసింది . ఇప్పటికే తుపాను​ ప్రభావంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించి.. వారం రోజుల్లో ముగించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్లు, అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. పంట నష్టాన్ని చూసి రైతులు నిరాశకు గురి కావొద్దని పేర్కొన్నారు. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవాలిని ఆదేశించారు .

అదేవిధముగా పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో.. రైతులకు విత్తనాలు అందించాలని ఇళ్లు ముంపునకు గురైతే కుటుంబానికి 2 వేల రూపాయలు ఆర్థిక సాయం, రేషన్‌ ఇవ్వనున్నట్లు సమావేశంలో తెలిపారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పైనాపిల్, ఒక్కో పైనాపిల్ ధర ₹ 1 లక్ష..

Share your comments

Subscribe Magazine