నేటికాలంలో బ్యాంక్ ద్వారా లోన్ పొందాలి అంటే అదో పెద్ద పనిగా మారింది. లోన్ పొందడం అంత సులువైన పని కాదు. వినియోగదారుడు లోన్ పొందడానికి వారి యొక్క చిరునామా, వారి సంపాదన వివరాలు మరియు సెక్యూరిటీ కింద వారి ఆస్తి డాక్యూమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఇన్ని పనులు చేసిన కూడా మనకి లోన్ వస్తుందనే గ్యారంటీ లేదు.
ఇదివరకన మనం లోన్ పొందడానికి బ్యాంకుల చుట్టూ అనేక సార్లు తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా లోన్ ప్రాసెస్ కి సంబంధించిన అన్ని పనులు మధ్యవర్తులు చూసుకుంటున్నారు. ఇప్పుడు మధ్యవర్తుల అవసరం కూడా లేకుండా కేవలం మీరు ఇంట్లో కూర్చుని కేవలం ఆధార్ కార్డు ద్వారా రూ. 2 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వినియోగదారులకు ప్రస్తుతం లోన్స్ పొందడానికి ఈ-కేవైసీతో మరింత సులువు అయ్యింది. కాబట్టి ఇప్పుడు చాల సులువుగా ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్స్ అనేవి ప్రముఖ బ్యాంక్ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మరియు అనేక బ్యాంకుల వినియోగదారులు లోన్స్ పొందవచ్చు. కానీ ఈ లోన్స్ పొందడానికి వినియోగదారులకు క్రెడిట్ స్కోర్ అనేది కచ్చితంగా 750 కన్నా ఎక్కువ ఉండాలి. ఈ వినియోగదారులకు కేవలం 5 నిమిషాల్లో రూ.2 లక్షల వరకు రుణం పొందవచ్చు.
ఇది కూడా చదవండి..
ఒక్కసారిగా తగ్గిన ధరలు.. ఆందోళనలో రైతులు
ఆధార్ కార్డ్ ద్వారా పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి:
1. ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందుగా మీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. పర్సనల్ లోన్ కోసం వినియోగదారుడు తన బ్యాంక్ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కూడా దరఖాస్తు చేయవచ్చు.
3. యాప్ ఓపెన్ చేసిన తరువాత ఓటీపీ ఆధారంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
4. ఆ తరువాత, పర్సనల్ లోన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
5. లోన్ పొందడానికి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.
6. ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ వివరాలను కూడా సమర్పించాలి.
వినియోగదారుడు అందించిన సమాచారాన్ని బ్యాంక్ పరిశీలించి ధృవీకరిస్తుంది. ఆ లోన్ పొందడానికి మీరు అర్హులైతే వెంటనే ఆమోదిస్తుంది. బ్యాంక్ ఆమోదం తెలిపిన వెంటనే మీ ఖాతాల్లో డబ్బులు జమ చేయబడతాయి.
ఇది కూడా చదవండి..
Share your comments