News

ఒక్కసారిగా తగ్గిన ధరలు.. ఆందోళనలో రైతులు

Gokavarapu siva
Gokavarapu siva

భారతదేశంలో ప్రధానంగా పండించే పంటల్లో మిరప పంట కూడా ఒకటి. దేశంలోనే ఈ మిరప సాగులో ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ నాణ్యతగల మిర్చిని భారతదేశం నుండి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఈ మిరపలో విటమిన్ సి మరియు బి, కాల్షియమ్, మెగ్నీషియం, ఐరన్ అనేవి అధికంగా ఉంటాయి. ప్రస్తుతం మిరప సాగు చేస్తున్న రైతులను మార్కెట్ లోని ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

కర్ణాటక ఎన్నికలు మిర్చి రైతులపై ప్రతికూల ప్రభావం చూపాయి. కర్ణాటకలో ఎన్నికల కారణంగా ప్రతిచోటా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీనితో వ్యాపారులు కూడా కొనడానికి ముందుకు రావట్లేదు. కర్నూలు జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవగా.. పంటకు క్వింటా మిర్చి ధర రూ.17 వేల నుంచి రూ.19 వేలకు పడిపోయింది.

కానీ మొదట్లో ఇదే మిర్చికి మార్కెట్ లో క్వింటాకు రూ.25 వేల రూపాయల వరకు పలికింది. సీజన్ ప్రారంభంలో, ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి పడిపోయాయి. కొందరు రైతులు తమ పంటలను కల్లులో ఉంచాలని నిర్ణయించుకోగా, మరికొందరు శీతల గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. ధరలు లేక రైతులు దిగులు చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త: రైతులకు అందుబాటులోకి 'నానో డీఏపీ'..కేవలం రూ.600లకే

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రైతులు బ్యాడిగ, గడగ్ మార్కెట్‌లకు బ్యాడిగ మిరపను విక్రయిస్తున్నారు. బ్యాడిగ రకం మిర్చిని మొదట్లో క్వింటా మిర్చి రూ.60 వేలకు విక్రయించేవారు. ప్రస్తుతం వ్యాపారులు మిర్చిని రూ.40 వేలకు కొనుగోలు చేస్తున్నారు. దిగుబడి తక్కువ వచ్చినా మంచి లాభాలు వస్తాయని ఆశించిన బ్యాడిగ మిర్చి ధర పతనం కావడం రైతుల బతుకులను అతలాకుతలం చేసింది. అధికారులు కర్నూలు జిల్లావ్యాప్తంగా 6.64 మెట్రిక్‌ టన్నుల మిర్చి గిగుబడి వచ్చిన్నట్లు అంచనా వేశారు.

ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎన్నికల కారణంగా తనిఖీలు ఎక్కువగా గరుగుతున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో నగదు లావాదేవీలు కూడా కష్టతరంగా మారింది. వీటితోపాటు రాష్ట్రంలో పండుగలు కారణంగా హమాలీలు రాకపోవడంతో బ్యాడిగలో వారానికి రెండు రోజులు మార్కెట్‌ జరుగుతోంది. వీటి అన్నిటి కారణంగా ధరలు పతనమయ్యాయి.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త: రైతులకు అందుబాటులోకి 'నానో డీఏపీ'..కేవలం రూ.600లకే

Related Topics

Mirchi chilli price hike

Share your comments

Subscribe Magazine