ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసి 10 సంవత్సరాలు దాటినా వారందరూ తన తమ ఆధార్ కార్డును ఉచితముగా అప్డేట్ చేసుకోవడానికి UIDAI గతంలో ఆరు నెలల సమయం ఇస్తూ జూన్ 14 ను చివరి గడువుగా ప్రకటించింది తిరిగి ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి ఈ గడువును పొడిగిస్తూ సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చింది ఇప్పుడు ఈ గడువు త్వరలో ముగుస్తుండడంతో గడువు తిరిగి డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ UIDAI మెమోరాండం జారీ చేసింది.
ప్రతి ఒక్కరు తమ ఆధార్‌ను అప్‌డేట్ చేసేలా ప్రోత్సహించడానికి, డిసెంబర్ 14 వరకు ఉచితంగా myAadhaar పోర్టల్ ద్వారా ఆధార్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
ఉచితంగా ఆధార్ అప్డేట్ ఎలా చేయాలి?
ఆధార్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి తప్పనిసరిగా OTP పంపబడే ఆధార్‌తో లింక్ చేయబడిన ఫోన్ నంబర్ ఉండాలి.
1. myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. మీరు వెల్‌కమ్ టు మైఆధార్‌ను చూడవచ్చు, దాని క్రింద ఉన్న లాగిన్‌పై క్లిక్ చేయండి.
3. ఆధార్ నంబర్ మరియు క్యాప్చా ఇచ్చిన తర్వాత మీరు OTP ఇవ్వడం ద్వారా లాగిన్ చేయవచ్చు.
4. చిరునామా అప్‌డేట్‌పై క్లిక్ చేసి, మీ ఆధార్‌ను నవీకరించండి.
5. మొబైల్ నంబర్‌కు నమోదు చేసి, OTPని పొందండి, OTPని నమోదు చేసి, ధృవీకరించు
6 క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మెసేజ్ ద్వారా ఆధార్ అప్డేట్ చేసినట్లు గ సమాచారం వస్తుంది.
తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలు..
Share your comments