News

ఆధార్ -రేషన్ కార్డు లింకింగ్ కు చివరి అవకాశం .. త్వరగా లింక్ చేసుకోండి !

Srikanth B
Srikanth B
ఆధార్ -రేషన్ కార్డు లింకింగ్ కు చివరి అవకాశం ..  త్వరగా లింక్ చేసుకోండి !
ఆధార్ -రేషన్ కార్డు లింకింగ్ కు చివరి అవకాశం .. త్వరగా లింక్ చేసుకోండి !

 

రేషన్ కార్డు లబ్దిదారులకు అలర్ట్ జూన్ 30 తో ముగిసిన ఆధార్ -రేషన్ కార్డు లింకింగ్ గడువును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఆధార్- రేషన్ కార్డు లింకింగ్ గడువు ముగిసినప్పటికీ గడువును తిరిగి పొడిగిస్తూ లబ్దిదారులకు మరో అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ఇప్పటికి ఎవరైనా లబ్ధిదారులు రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించకుంటే సెప్టెంబర్ 30 లోపు లింక్ చేయాలనీ కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లేనియెడల లబ్దిదారులను రేషన్ కార్డు జాబితానుంచి తొలగిస్తామని హెచ్చరించింది.

 

ఆహార భద్రత కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 30నే ఈ గడువు ముగిసిన క్రమంలో మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది కావున లబ్ధిదారులు వీలైనంత త్వరగా లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలనీ వెల్లడించింది ప్రభుత్వం.

రేషన్ కార్డు పై లభించే పథకాలను , ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలంటే ప్రతి ఒక్కరు రేషన్ కార్డును -ఆధార్ తో లింక్ చేయాల్సి ఉంటుంది లేని పక్షంలో అంత్యోదయ అన్న యోజన, ప్రాధాన్యత గృహ ప్రథకాల ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది.

ఇకనుండి ఈ పథకాలు పొందాలంటే టెన్త్ తప్పనిసరి..ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రభుత్వం ప్రవేశపెట్టె సంక్షేమ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు ఉన్నవారికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యంతో చాల వరకు ప్రభుత్వ పథకాలు పొందడానికి దీనినే ప్రామాణికంగా తీసుకుంటాయి కావున లబ్ధిదారులు వీలైనంత త్వరగా లింక్ చేయడం మంచిది.

కొన్ని చోట్ల లబ్ధిదారులు రెండు రేషన్ కార్డులను కల్గి ఉండడంతో నిజమైన లబ్దిదారులకు ఈ ప్రయోజనాలు అందడంలేదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కాబట్టి ప్రతి ఒక్కరు తమ రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ లింక్ చేయకపోతే మాత్రం వారి పేర్లను రేషన్ కార్డు జాబితా నుంచి తొలగిస్తారు.

ఇకనుండి ఈ పథకాలు పొందాలంటే టెన్త్ తప్పనిసరి..ప్రభుత్వం కీలక నిర్ణయం

Related Topics

NEW RATION CARDS

Share your comments

Subscribe Magazine