రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు పంట బీమా, ఆరోగ్య బీమా, ఉచిత విద్యుత్ లాంటి అనేక పథకాలను ప్రభుత్వాలు అందిస్తున్నాయి. కానీ చాలామంది రైతులకు ఈ పథకాల గురించి తెలియదు. ఎందుకంటే ఈ పథకాల గురించి అవగాహన లేకపోవడమే. ఈ పథకాల ద్వారా రైతులకు అనేక లాభాలు ఉంటాయి. వీటి ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
అలాంటి పథకాల్లో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన. ఈ పథకం గురించి చాలామంది రైతులకు తెలియదు. ఇప్పుడు ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పధకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సొంత భూమి కలిగిన 18-40 సంవత్సరాల వయస్సు గల చిన్న , సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు పింఛన్ అందిస్తుంది. అయితే రైతులు కొంత ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. రైతులు కట్టే నెలవారీ ప్రీమియంకు సరిసమానంగా ప్రభుత్వం కూడా ప్రీమియం చెల్లిస్తుంది. 60 సంవత్సరాలు నిండిన తర్వాత రైతుకు నెలకు రూ . 3000 వేలు ఫించన్ వస్తాయి.
రైతులు మూడు నెలలకు లేదా 4 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారి ఈ ప్రీమియం చెల్లించవచ్చు. అలాగే రైతులు తమ బ్యాంక్ అకౌంట్ నుండే నేరుగా డబ్బులు తీసుకోవచ్చు. రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం డబ్బులను ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం ప్రీమియం చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు.
ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పధకంలో ఎలా చేరాలి?
-మీ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు
- వినియోగదారుల సేవ కేంద్రం లేదా 1100 కు కాల్ చేసి ఈ పథకం వివరాలు పొందవచ్చు.
Share your comments