News

ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ పథకం వల్ల లాభాలేంటి?.. ఎలా అప్లై చేసుకోవాలి?

KJ Staff
KJ Staff
Pradhan Mantri kisan Mandhan Yojana
Pradhan Mantri kisan Mandhan Yojana

రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు పంట బీమా, ఆరోగ్య బీమా, ఉచిత విద్యుత్ లాంటి అనేక పథకాలను ప్రభుత్వాలు అందిస్తున్నాయి. కానీ చాలామంది రైతులకు ఈ పథకాల గురించి తెలియదు. ఎందుకంటే ఈ పథకాల గురించి అవగాహన లేకపోవడమే. ఈ పథకాల ద్వారా రైతులకు అనేక లాభాలు ఉంటాయి. వీటి ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

 అలాంటి పథకాల్లో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన. ఈ పథకం గురించి చాలామంది రైతులకు తెలియదు. ఇప్పుడు ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పధకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సొంత భూమి కలిగిన 18-40 సంవత్సరాల వయస్సు గల చిన్న , సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు పింఛన్ అందిస్తుంది. అయితే రైతులు కొంత ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. రైతులు కట్టే నెలవారీ ప్రీమియంకు సరిసమానంగా ప్రభుత్వం కూడా ప్రీమియం చెల్లిస్తుంది. 60 సంవత్సరాలు నిండిన తర్వాత రైతుకు నెలకు రూ . 3000 వేలు ఫించన్ వస్తాయి.

 రైతులు మూడు నెలలకు లేదా 4 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారి ఈ ప్రీమియం చెల్లించవచ్చు. అలాగే రైతులు తమ బ్యాంక్ అకౌంట్ నుండే నేరుగా డబ్బులు తీసుకోవచ్చు. రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం డబ్బులను ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పథకం ప్రీమియం చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు.

ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పధకంలో ఎలా చేరాలి?

 -మీ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు

- వినియోగదారుల సేవ కేంద్రం లేదా  1100 కు కాల్ చేసి ఈ పథకం వివరాలు పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine