కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరియు జర్మనీ ఆర్థిక సహకార మరియు అభివృద్ధి మంత్రి స్వెంజా షుల్జ్ వర్చువల్ సమావేశంలో వ్యవసాయ-పర్యావరణ అభివృద్ధికి సంబంధించిన ఒప్పొందంపై సంతకం చేశారు.
భారతదేశం మరియు జర్మనీల మధ్య వ్యవసాయ-పర్యావరణ శాస్త్రం మరియు సహజ వనరుల స్థిరమైన నిర్వహణపై కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. దీనికి సంబంధించి, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మరియు జర్మనీ ఆర్థిక సహకారం మరియు అభివృద్ధి మంత్రి శ్రీమతి స్వెంజా షుల్జ్ ఈ రోజు జరిగిన వర్చువల్ సమావేశంలో డిక్లరేషన్‌పై సంతకం చేశారు.
ఈ ఒప్పొందం ద్వారా, రెండు దేశాల విద్యా సంస్థలు మరియు రైతులతో సహా అభ్యాసకుల మధ్య ఉమ్మడి పరిశోధన, విజ్ఞాన భాగస్వామ్యం మరియు ఆవిష్కరణలు ప్రోత్సహించబడతాయి. ప్రయివేటు రంగంతో ఎక్స్ఛేంజీలు, భాగస్వామ్యాలు మరియు పరిశోధన సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా సాంకేతికత మరియు శాస్త్రీయ పరిజ్ఞానం బదిలీని ప్రోత్సహించబడుతుంది. జర్మనీ యొక్క ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ 2025 నాటికి ఈ ఒప్పొందం కింద ప్రాజెక్ట్‌ల కోసం ఆర్థిక మరియు సాంకేతిక సహకారం కోసం 300 మిలియన్ యూరోల వరకు అందించాలని భావిస్తోంది.
సాంకేతిక సహకారం ప్రాజెక్ట్ ద్వారా భారతదేశంలో వ్యవసాయ-పర్యావరణ పరివర్తన ప్రక్రియకు మద్దతునిస్తూ జర్మనీ ఈ లైట్‌హౌస్ చొరవకు సమన్వయ మద్దతును అందిస్తుంది. మారుతున్న వ్యవసాయ శాస్త్ర ఎజెండా కోసం, విలువల ఆధారిత సాంకేతికత మరియు శాస్త్రీయ బదిలీని సులభతరం చేస్తూ భారతదేశం, జర్మనీ మరియు ఇతర దేశాల అభ్యాసకులతో అత్యాధునిక జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్థిక సహకారంతో ఒక ఉమ్మడి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రెండు దేశాలు భావిస్తున్నాయి.
వీటిని పర్యవేక్షించడానికి, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మరియు నీతి ఆయోగ్ మంత్రిత్వ శాఖలతో ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.
మరిన్ని చదవండి.
Share your comments