Agripedia

సీతాఫలం సాగుకు అనుకూలమైన దేశీయ, హైబ్రిడ్ రకాలు...!

Srikanth B
Srikanth B

శీతాకాలం సీజన్ లో మాత్రమే లభించే అత్యంత పోషక విలువలున్న సీతాఫలం పండ్లు ప్రస్తుతం మెట్ట ప్రాంత వ్యవసాయదారుల ముఖ్య ఆదాయ వనరుగా మారుతోంది.తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే సీతాఫలాన్ని తక్కువ వర్షపాతం గల మెట్ట భూముల్లో మరియు ఏ పంటకూ అనువుగాని భూముల్లో రైతులు సాగు చేస్తూ నిలకడైన ఆదాయాన్ని పొందవచ్చని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు.సీతాఫలం మొక్కలు ఎటువంటి నెలలోనైనా పెంచుకోవచ్చు. అయితే మురుగు నీటి వసతి కలిగి 6.0 -7.5 ఉదజని సూచిక గల నేలలు అత్యంత అనుకూలం.

ఎకరాకి 160 సీతాఫలం మొక్కలు చక్కగా సరిపోతాయి. మొక్కలు నాటడానికి వారం ముందు గుంతలు తీసి పెట్టడం వల్ల భూమిలో దాగి ఉన్న లార్వాలు నశించి అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. మొక్కలను 5 x 5 మీ. దూరంలో నాటుకోవాలి. ప్రస్తుతందేశీయ రకాలతో పాటు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి మన ప్రాంత వాతావరణానికి అనుకూలమైన బాగా ప్రాచుర్యం పొందిన రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బాలానగర్: కాయలు పిరమిడ్ ఆకారంలో పెద్ద సైజులో పెద్ద కళ్లతో ఉంటాయి. కళ్ల మధ్య లేత పసుపురంగు నుంచి నారింజరంగులో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. మధురమైన రుచి, 27శాతం చక్కెర కలిగి, 200-260 గ్రాముల సగటు బరువుతో ఉంటాయి.

అతిమాయ: కాయలపై చర్మం నునుపుగా ఉండి తక్కువ గింజలు కలిగి తీపి పులుపు కలిగిన ప్రత్యేకమైన గుజ్జు ఉంటుంది. ఈ చెట్లలో పరాగ సంపర్కానికి ప్రతి 20 చెట్లకు ఒకదానిని నాటాలి.

అర్కనహాన్: ఇది హైబ్రిడ్ రకం. ఐఐహెచ్‌ఆర్ బెంగళూరు వారు రూపొందించారు. ఐలాండ్, జమ్ మమ్మిత్ రకాలను సంకరపరచి దీనిని రూపొందించారు. కాయలు గుండ్రంగా చర్మంగా కళ్లు ప్రస్ఫుటంగా లేకుండా నునుపుగా ఉంటాయి. గుజ్జు అత్యంత తియ్యగా, గింజలు చాలా తక్కువగా ఉంటాయి.

 

పింక్స్‌మమ్మిత్: ఇది ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న రకం. కాయలు పెద్దగా అండాకారంలో ఉండి చర్మం ఆకుపచ్చ మీద పింక్ రంగు కలిగి ఉంటుంది. గుజ్జు తక్కువగా ఉంటుంది.

ఐలాండ్‌జెను: ఇది కూడా ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న రకమే. కాయలు మంచి నాణ్యత కలిగి పెద్దగా నునుపైన చర్మం కలిగి ఉంటాయి.విత్తనలను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.

 

Organic farming :"రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్న్యాయంగా సేంద్రియ వ్యవసాయం దిశగా రైతును ప్రోత్సహించాలి"-M భాస్కరయ్య

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More