వ్యవసాయం, పంటల బీమా మరియు రుణాలపై వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ UNDPతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
ఈ ఒప్పొందం లో భాగంగా యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP), కేంద్ర వ్యవసాయ శాఖ యొక్క పథకాలైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) మరియు వడ్డీ రాయితీ పథకాలకి సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది.
(PMFBY) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు రూ. 21000 కోట్ల ప్రీమియం చెల్లించగా, వారికి రూ. 1.15 లక్షల కోట్లకు పైగా పరిహారం లభించింది.కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌లో ముందుగా పథకం ద్వారా ప్రయోజనం పొందలేకపోయిన రైతులకు ప్రయోజనాలను అందించడానికి భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్న రైతులు, పశువుల రైతులు మరియు మత్స్యకారులందరికీ ఈ పథక ప్రయోజనాలు చేరువయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ఒప్పొందం ప్రకారం UNDP వ్యవసాయ రుణం మరియు పంటల బీమాను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రతిస్పందించే, డిమాండ్-ఆధారిత సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది, అలాగే ప్రస్తుత జాతీయ మరియు రాష్ట్ర సంస్థలకు అభివృద్ధి మరియు సమాచారం, విద్య & కమ్యూనికేషన్ (ఐఇసి) మద్దతును అందిస్తుంది. చిన్న మరియు సన్నకారు రైతులు, మహిళా రైతులు, భాగస్వామ్య రైతులు, కౌలు మరియు రుణాలు పొందని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలను చేపట్టనుంది.
ఒప్పొంద కార్యక్రమం లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమక్షంలో PMFBY ప్రధాన కార్యదర్శి -రితేష్ చౌహాన్ మరియు యూఎన్‌డీపీ రెసిడెంట్ రిప్రజెంటేటివ్ షోకో నోడా ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ ఈ ఒప్పొందం చిన్న మరియు సన్నకారు రైతులకి ప్రయోజనం చేకూరుస్తుందని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా 'గత 4 సంవత్సరాలలో UNDP అందించిన సాంకేతిక సహాయం మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ భాగస్వామ్యం ద్వారా, మనం పంట బీమా మరియు వ్యవసాయ రుణాల అమలులో మరింత మెరుగైన ఫలితాలను పొందగలమని' విశ్వాసం వ్యక్తం చేసారు.
మరిన్ని చదవండి
Share your comments