అగ్రి టెక్ మధ్యప్రదేశ్ 2024 అత్యాధునిక వ్యవసాయ పనిముట్లు , సాంకేతికతలు మరియు వ్యవసాయ పద్ధతులను ప్రదర్శిస్తుంది. వ్యవసాయంలో నూతన మేకులవలు తెలుసుకునేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం.
మధ్య ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ అగ్రిటెక్ 2024 ను ప్రారంభించింది, ఈ కార్యక్రమం మొత్తం మూడు రోజులు జరగనుంది దీనినే కృషి విజ్ఞాన్ మేళగా పరిగణిస్తారు. ఫిబ్రవరి 20 నుండి 22, 2024 వరకు జరిగే ఈ వ్యవసాయ సైన్స్ ఫెయిర్, మధ్య ప్రదేశ్, సాత్నా జిల్లా, AKS యూనివర్సిటీ లో జరగనుంది. రైతుల ఆర్ధిక శ్రేయస్సును పెంచి, వారిని ప్రకృతి వ్యసాయం,స్థిరమైన వ్యవసాయ పద్ధతుల వైపు సాగేలా ప్రోత్సహహించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.
చెరుకు రైతులకు తీపి కబురు.. క్వింటాల్ 340రూ వరకు పెంపు.
ప్రారంభించిన మొదటి రోజే 25000 మంది, వ్యవసాయదారులు, విద్యార్థులను, వ్యవసాయ ఔత్సాహికులను ఈ ఈవెంట్ ఆకర్షించింది. కొత్త ఆవిష్కరణలు గురించి తెలుసుకునేందుకు, నెట్వర్కింగ్ కు ఇది ఒక మంచి వేదికగా ఆవిర్భవించింది. మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయం ఒక కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయ రంగంలో కొత్త పురోగతులు తెలుసుకొని వాటిని పాటించడం ద్వారా వ్యవసాయం లో ఉత్పాదకత పెరిగి రాష్ట్రం ఆర్ధికంగా వృద్ధి చెందుతుంది అని నమ్ముతున్నారు.
Share your comments