తెలంగాణ రాష్ట్ర రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం,రైతులను ఆర్థికంగా ముందుకు తీసుకురావడం కోసం రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు పథకం అమలులోకి తీసుకువచ్చింది. అదేవిధంగా రైతు బీమా పథకాన్ని కూడా రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రెండు పథకాలకు రైతులందరూ అర్హులు. రైతు బంధు పథకం ఒకసారి నమోదు చేసుకుంటే ప్రతిసారీ ఆ పథకం ద్వారా వచ్చే డబ్బులను పొందవచ్చు. కానీ రైతు భీమా పథకం ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రమాదవశాత్తు అన్నదాతలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటించింది.
ఇప్పటివరకు ఎవరైతే ఈ పధకంలో అనర్హులుగా ఉంటారో అలాంటి వారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చని తెలంగాణ సర్కార్ వెల్లడించింది.ఎవరైతే ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీలోగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటారో అలాంటి రైతులు రైతు బీమా పథకానికి అర్హులుగా తెలుపుతూ వెల్లడించింది. అలాంటి రైతులు ఆగస్టు 11వ తేదీలోగా రైతు బీమా పథకానికి అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల రైతులు మాత్రమే అర్హులు.వీరి ఆధార్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా తీసుకుంటారు.
అదేవిధంగా ఓకే రోజుకు రెండు మూడు చోట్ల భూమి ఉన్నప్పటికీ కేవలం ఒక చోటకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే రైతు వచ్చి నామినేషన్ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ AEO కు అందజేయాలి.ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేయలేకపోతే మరో ఏడాది పాటు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. కనుక ఎవరైతే రైతు బీమా పథకానికి దరఖాస్తు చేయకుండా ఉంటారో అలాంటి రైతులు ఆగస్టు 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
Share your comments