News

Alert! PAN-Aadhaar linking:పాన్-ఆధార్ ఇంకా లింక్ చేయలేదా? అయితే ఇలా చేయండి !

Srikanth B
Srikanth B

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ లేదా సిబిడిటి ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, (PAN-Aadhaar link)ఆధార్ మరియు పాన్ లింక్ చేయక పోతే రూ .1,000 వరకు జరిమానా విధించబడుతుంది .

న్యూఢిల్లీ: మీ పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN-Aadhaar linking)ను ఆధార్తో లింక్ చేసుకునే గడువు ఇప్పటికే ముగిసింది. దీని అర్థం మీ పాన్ ఇన్ యాక్టివ్ కావచ్చు మరియు దానిని పునరుద్ధరించడానికి మీరు అపరాధ  రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మీరు జరిమానా చెల్లించి, మీ ఆధార్-పాన్ను లింక్ చేస్తే(PAN-Aadhaar link), బ్యాంకు ఖాతా తెరవడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, మీ  పెట్టుబడి పెట్టడం వంటి సేవలను మీరు తిరిగి పొందవచ్చు.

(PAN-Aadhaar linking)పాన్-ఆధార్ లింక్ చేయలేదా?

సాధ్యమైనంత త్వరగా మీ ఆధార్ మరియు పాన్ ను లింక్ చేయడం అనేదిచాల అవసరం . అయితే ఎప్పుడు కనీస అపరాధ రుసుము 500 తో జూన్ 30 వరకు (PAN-Aadhaar linking) పాన్-ఆధార్ లింక్ చేసుకొనే అవకాశాన్ని ఇచ్చింది , జూన్ 30 గడువు దాటితే అపరాధ రుసుము రూ . 1000 చెలించాల్సి ఉంటుంది .

 

 

HOW TO LINK PAN-Aadhaar:   ఆన్ లైన్ లో పాన్-ఆధార్ లింక్ ఎలా చేయాలి?

  • అధికారిక ఆదాయపు పన్ను వెబ్ సైట్ చూడటానికి www.incometax.gov.in వెళ్ళండి.
  • మీ కంప్యూటర్ స్క్రీన్ యొక్క ఎడమవైపున ఉండే 'క్విక్ లింక్ లు' సెక్షన్ నుంచి 'లింక్ ఆధార్' ఆప్షన్ ఎంచుకోండి.
  • ఒక కొత్త విండో కనిపిస్తుంది. మీ పాన్ నెంబరు, ఆధార్ డేటా, పేరు మరియు మొబైల్ నెంబరుతో కొత్త స్క్రీన్ పై స్లాట్ లను నింపండి.
  • సమాచారాన్ని వాలిడేట్ చేసిన తరువాత, 'నా ఆధార్ వివరాలను వాలిడేట్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను' ఆప్షన్ ఎంచుకోండి
  • . ఆ తర్వాత 'కంటిన్యూ' ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై, మీరు వన్ టైమ్ పాస్ వర్డ్ (OTP) అందుకుంటారు. స్క్రీన్ మీద ఖాళీలను నింపండి, తరువాత 'వాలిడేట్' మీద క్లిక్ చేయండి. మీరు పెనాల్టీ చెల్లించిన తరువాత, మీ పాన్ మరియు ఆధార్ లింక్ చేయబడతాయి.

Hyderabad Metro :పెరగనున్న హైదరాబాద్ మెట్రో స్పీడ్ .. ప్రయాణ సమయం 6 నిమిషాలు తగ్గనుంది ! (krishijagran.com)

Share your comments

Subscribe Magazine

More on News

More