Health & Lifestyle

Hyderabad Metro :పెరగనున్న హైదరాబాద్ మెట్రో స్పీడ్ .. ప్రయాణ సమయం 6 నిమిషాలు తగ్గనుంది !

Srikanth B
Srikanth B

Hyderabad Metro Rail: ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (Commissioner for Metro Rail Safety) కమిషనర్ ఫర్ మెట్రో రైల్ సేఫ్టీ (CMRS ) నుండి ఆమోదం పొందింది, ఇది రైళ్ల (Metro Rail) కు సంబందించి ఎంత వేగం తో నడపాలి అనే దానికి అనుమతులను జారీచేస్తుంది , ఇది ప్రస్తుత వేగం గంటకు 70 కిలోమీటర్ల నుండి 80 కి.మీ.కు కు పెంచు కునే అవకాశాన్ని (Hyderabad Metro) కు అనుమతి లభించింది .

(L &T) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)  ఇటీవల తన మెట్రో వ్యవస్థ యొక్క పూర్తి వేగ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో మార్పులు చేసింది. ఈ సిస్టమ్ సాఫ్ట్ వేర్ ని మార్చి28 నుండి 30 వరకు (CMRS )  డైరెక్టర్ జనక్ కుమార్ గార్గ్ తనిఖీ చేశారు. భద్రతా తనిఖీల్లో భాగంగా, స్పీడ్ ట్రయల్స్ నిర్వహించబడ్డాయి మరియు భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు  నిర్ధారించుకున్న తరువాత, ఈ అప్ గ్రేడ్ చేయబడ్డ సిస్టమ్ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించడానికి CMRS ఆథరైజేషన్ జారీ చేసింది.

ఈ అనుమతితో,( Hyderabad Metro)ఇప్పుడు తన రైళ్లను పూర్తి వేగానికి నడపగలదు, ఇది ప్రస్తుత వేగం 70 Kph నుండి 80  Kph కు పెరుగుతుంది, దీని ఫలితంగా కారిడార్ టెర్మినల్స్ మధ్య గణనీయమైన సమయం ఆదా అవుతుంది. దీంతో కారిడార్ 3 (నాగోల్ నుంచి రాయదుర్గం వరకు)  ప్రయాణ సమయం 6 నిమిషాలు తగ్గుతుందని భావిస్తున్నారు

కారిడార్ 1 (మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు) లో 4 నిమిషాలు, కారిడార్ 2లో 1.15 నిమిషాలు (MGBS  నుంచి JBS  వరకు) ఈ అప్ గ్రేడ్ చేయబడ్డ సిస్టమ్ సాఫ్ట్ వేర్ తో   వైబ్రేషన్స్ తగ్గుతాయని కూడా భావిస్తున్నారు.

(L &T MRHL ) MD , CEO  కెవిబి రెడ్డి మాట్లాడుతూ, సిఎంఆర్ఎస్ నుండి అనుమతిని పొందడంతో, వారు ఇప్పుడు మెట్రో వ్యవస్థలను పూర్తి వేగ సామర్థ్యానికి పెంచుతామని, తద్వారా టెర్మినల్ స్టేషన్ల మధ్య సమయం ఆదా అవుతుందని, ఇది మెరుగైన ప్రయాణీకుల అనుభవానికి దారితీస్తుందని అన్నారు.

మార్పులు :

హైదరాబాద్ మెట్రో స్పీడ్( Hyderabad Metro Speed ) లిమిట్ గంటకు 70 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లకు పెరగనుంది.

  •  మొత్తం 3 కారిడార్ లపై టెర్మినల్ స్టేషన్ ల మధ్య సమయం ఆదా అవుతుంది.
  • కారిడార్ 3 (నాగోల్-రాయదుర్గం) మధ్య ప్రయాణ సమయం 6 నిమిషాలు తగ్గుతుంది.
  • కారిడార్ 1 (మియాపూర్-ఎల్బీనగర్)  మధ్య ప్రయాణ సమయం 4 నిమిషాలు తగ్గుతుంది.
  • కారిడార్ 2 (MGBS-JBS) మధ్య ప్రయాణ సమయం 1.15 నిమిషాలు తగ్గుతుంది. 
  • CUCET రిజిస్ట్రేషన్ ప్రారంభం ... దరఖాస్తు చేసుకోండి ఇలా !.

Share your comments

Subscribe Magazine