News

రైతుల ఆశలన్నీరుణ'మాఫీ'పైనే.. ఎన్నికల ముందు అయిన రుణమాఫీ జరిగేనా ?

Srikanth B
Srikanth B
రైతుల ఆశలన్నీరుణ'మాఫీ'పైనే.. ఎన్నికల ముందు అయిన రుణమాఫీ జరిగేనా ?
రైతుల ఆశలన్నీరుణ'మాఫీ'పైనే.. ఎన్నికల ముందు అయిన రుణమాఫీ జరిగేనా ?

ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక అంశంగా వున్నా రుణమాఫీ .. ఎన్నికల తరువాత మరుగున పడింది. నాలుగు దఫాలలో రుణమాఫీ చేస్తామన ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు దాటినా కేవలం రెండు దఫాలు మాత్రమే రుణమాఫీ అయ్యింది అదికూడా మూప్పయి ఏడు వెలలోపు వారికే సంపూర్ణంగా ఇప్పటివరకు రుణమాఫీ అయ్యింది మిగిలిన రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు . ఎన్నికలు దగ్గర పడడంతో ఎప్పటికైనా రుణమాఫీ జరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు .

అయితే బడ్జెట్ 2023-24 లో కేటాయించిన నిధులతో లక్ష లోపు రుమాఫీ సాధ్యమేనా అన్నా సందేశం అందరిలోనెలకొంది . ఈ ఏడాది రూ.90 వేల లోపు గల రైతుల పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. గత బడ్జెట్‌లో రైతు రుణమాఫీ కోసం రూ.4,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.2,385 కోట్లు అధికంగా కేటాయించింది. ఈ నిధులతో రూ.37 వేల నుంచి రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు సమాచారం .

ఇది కూడా చదవండి .

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు శుభవార్త.. పారా బాయిల్డ్ రైస్ సేకరణ


మరోవైపు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామన్న సర్కారు ఇందుకు రూ. 19,198 కోట్లు లెక్కగట్టగా ఇప్పటివరకు రూ. 37 వేలలోపు రుణాలున్న రైతులకు రూ. 1,207 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ. 17,991 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ప్రభుత్వం చొరవ తీసుకొని ఎన్నికల ముందయిన రుణమాఫీ చేయాలనీ రైతు ప్రభుత్వాన్ని కోరుతున్నారు .

ఇది కూడా చదవండి .

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు శుభవార్త.. పారా బాయిల్డ్ రైస్ సేకరణ

Related Topics

runamafie scheme

Share your comments

Subscribe Magazine