News

గోమూత్రం కొంటున్న ప్రభుత్వం.. లీటర్‌కి ఎంతంటే?

Srikanth B
Srikanth B
Godhan Nyay Yojana
Godhan Nyay Yojana

ఈ పథకం కింద రైతుల నుంచి పశువుల పేడను సేకరిస్తున్నారు. ఐతే ఇప్పుడు గోమూత్రాన్ని కూడా సేకరించనున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానుంది.మరో వారం రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లోని ఉత్తరాది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా గోమూత్రం కొనుగోళ్లను ప్రారంభిస్తారు. గోమూత్రాన్ని కొనుగోలు చేయాలని ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయించింది.దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఆవు మూత్రం కొనుగోలు చేసే విధానంతో పాటు మొత్తం ప్రణాళికపై పరిశోధన చేసే పనిని కమిటీకి అప్పగించారు. దీనిపై ఆ కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. అది తుది దశంలో ఉందని.. త్వరలోనే సీఎం భూపేష్ బఘేల్‌కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

లీటరు గోమూత్రం ధరను రూ.4గా కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సీఎం భూపేష్ బఘేల్ ఆమోదం తెలపాల్సి ఉందని సీఎం ముఖ్య సలహాదారు ప్రదీప్ శర్మ తెలిపారు. గోమూత్రాన్ని గ్రామ గోఠాన్‌ సమితి ద్వారా సేకరిస్తామని ఆయన చెప్పారు.


జూలై 28న గోమూత్రం కొనుగోలు పథకాన్ని ప్రారంభించవచ్చని ఈ విషయంపై అవగాహన ఉన్న మరో పరిపాలనా అధికారి మీడియాకు తెలిపారు.ఈ రోజున స్థానిక పండుగ హరేలీని ఇక్కడ జరుపుకుంటారు. పండగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

త్వరలో ఆవు మూత్రాన్ని కూడా కోనుగోలు చేయనున్నారు. దీనిని సేంద్రీయ పురుగుమందుల తయారీకి ఉపయోగించనున్నారు.ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల బయో ఫెస్టిసైడ్స్‌ తయారవుతున్నాయి. సేంద్రీయ పురుగుల మందులతో అందరికీ మేలు జరుగుతుందని.. ఆవుమూత్రంతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం తెలిపింది.

రైతులకు గోల్డెన్ అవకాశం: “కృషి పండిట్ అవార్డు” కోసం దరఖాస్తుల స్వీకరణ.. ₹1,25,000 బహుమతి!

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన గోధన్ న్యాయ్ పథకానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రైతులు, పశువుల యజమానుల నుంచి పేడను సేకరిస్తున్నారు. కిలోకు రూ.2 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వర్మీ కంపోస్ట్‌ను తయారు చేసేందుకు వీలుగా పెద్ద మొత్తంలో సేకరిస్తున్నారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చికు గరిష్ట ధర ... క్వింటాలుకు 22,800

Share your comments

Subscribe Magazine