News

పొలం దున్నుతుండగా బయటపడ్డ పురాతన సంపద ..

Srikanth B
Srikanth B

 

ఈమధ్య కాలంలో పొలం దున్నుతుంటే పురాతన వస్తువులు దొరకడం సర్వ సాధారణం అయిపొయింది నిత్యం ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం అలంటి ఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా లో చోటు చేసుకుంది వివరాలు ఏంటో ఇక్కడ చూద్దాం !

 

కాకినాడ జిల్లా తుని సమీపంలోని గొంపకొండ ప్రాంతంలో రైతులు తమ పొలాలను చదును చేస్తుండగా.. 12వ శతాబ్దం యలమంచిలి చాళుక్యుల కాలం నాటి రాతికుండలు, ప్రమిదలు, శిలాఫలకాలు లాంటివి బయటపడ్డాయి.

గతంలో ఈ గొంపకొండ ప్రాంత సమీపంలో ఓ పట్టణం ఉండేదని.. అగ్ని ప్రమాదం లేదా మశూచి లాంటి భయంకరమైన వ్యాధి కారణంగా అక్కడున్న ప్రజలు వలసపోయి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు. అందుకే అక్కడ ఉన్న ఆలయం అనంతర కాలంలో మట్టిలో కూరుకుపోయి ఉండొచ్చునని వారి అంచనా. ఇక ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్న రైతులు.. వారికి పొలం పనుల్లో దొరికిన ఈ గుడి రాళ్లను సరిహద్దు కంచెగా, అలాగే తవ్వకాల్లో బయటపడిన దేవతామూర్తి విగ్రహాలను స్థానిక దేవతలుగా పూజిస్తున్నారని చెప్పుకొచ్చారు.

రూ.కోట్లు పలుకుతున్న దున్నపోతు..అంత స్పెషల్ ఏంటి ?

ఇవి మాత్రమే కాదు.. పురాతన ఇటుకలు, గుడి శిధిలాలు, రాతి శాసనాలు సైతం ఆ ప్రాంతంలో లభ్యమయ్యాయి.కాగా, తవ్వకాల్లో బయటపడిన ఈ శిల్ప సంపద క్రీ.శ. 800-1240 మధ్య కాలంలో వెలసిల్లిన ఆలయానిదిగా పురావస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యలమంచిలి చాళుక్యుల పాలన సమయంలో ఆ ప్రాంతంలో ‘జననాధపట్నం’ అనే పట్టణం ఉండేదని.. తదనంతరం ‘జగన్నాధపురం’ అనే గ్రామం చలామణిలోకి వచ్చిందని చెప్పారు.

రూ.కోట్లు పలుకుతున్న దున్నపోతు..అంత స్పెషల్ ఏంటి ?

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine

More on News

More