News

రూ.కోట్లు పలుకుతున్న దున్నపోతు..అంత స్పెషల్ ఏంటి ?

Srikanth B
Srikanth B
Gajendra buffalo
Gajendra buffalo

మహారాష్ట్ర లో జరుగుతున్న ఒక వ్యవసాయ ప్రదర్శనలో లో కర్ణాటక నుంచి ఒక రైతు ప్రదర్శన కు ఉంచిన ఒక దున్నపోతు అందరి చూపులను ఆకర్షిస్తున్నది , వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన రైతులు అయితే దీనిని కోట్లకు కొంటామని చెబుతున్న ఆ రైతు అమ్మడానికి నిరాకరిస్తున్నాడు , అసలు ఆ దున్నపోతు ప్రత్యేకత ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకుందాం .

గజేంద్ర అనే పేరు కల్గిన దున్నపోతు రైతులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీని బరువు 1500 కిలోలు ఉంటుంది. రోజుకు 15 లీటర్ల పాలు తాగుతుంది. దాని బరువు, తినే తిండి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 1500 కిలోలు బరువున్న ఈ దున్నపోతు.. రోజుకు 15 లీటర్ల పాలు తాగుతుంది. కర్ణాటక బెళగావికి చెందిన రెడ్యాచే మాలక్​ అనే వ్యక్తి.. ఈ గజేంద్రకు యజమాని. మహారాష్ట్రలోని బీడ్​ జిల్లాలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనకు దీన్ని తీసుకొచ్చాడు రెడ్యాచే. గజేంద్రను చూసేందుకు రైతులు ఎగబడుతున్నారు. దీని ధర దాదాపు 1.5 కోట్లు వరకు ఉంటుందని దాని యజమాని రెడ్యాచే తెలిపాడు .


ఇది రోజు 15 లీటర్ల పాలతో పాటు.. రెండు కిలోల పిండి, 3 కిలోల గడ్డి తింటుంది. దీని నుంచి మాకు రోజుకు రెండు వేల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ తరహా దున్నపోతులు మా దగ్గర ఐదు ఉన్నాయి. వీటి నుంచి మొత్తం రూ.10 వేలు వస్తాయి. మరో 50 గేదేలు ఉన్నాయి. ఇవి 100 నుంచి 150 లీటర్ల పాలు ఇస్తాయి. వీటి నుంచి రోజుకు రూ. 50వేలు వస్తాయి." అని దీని యజమాని తెలిపాడు .

రోజుకు 26.59 లీటర్ల పాలు... రికార్డు సృష్టించిన గేదె !

ఈ వ్యవసాయ ప్రదర్శన శాలను గత 15 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర రైతులకు సాంకేతికతను అందించే లక్ష్యంతో ఈ ప్రదర్శన శాలను ఏర్పాటు చేశాం. కిసాన్ కృషి ప్రతిస్థాన్ అనే సంస్థ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా ఈ ప్రదర్శన శాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ 180 స్టాల్​లను అందుబాటులో ఉంచాం. మధ్యప్రదేశ్​, హరియాణా, పంజాబ్​ ఇతర రాష్ట్రాల నుంచి రైతులు ఈ ప్రదర్శనకు వస్తున్నారు.

రోజుకు 26.59 లీటర్ల పాలు... రికార్డు సృష్టించిన గేదె !

Related Topics

murrabufelo

Share your comments

Subscribe Magazine