News

AP ఎలక్షన్స్ 2024: మీరా.... నేనా.....

KJ Staff
KJ Staff

ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికల క్యాంపైన్లు, మరియు ఎన్నికల మేనిఫెస్టోలతో, ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు అన్ని మంచి జోష్ తో ముందుకు సాగుతున్నాయి. ఇది ఇలా ఉంటె మార్చ్ 10 వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కి అనువుగా, ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీలు తమ కార్యాచరణలకు సిద్ధం అవుతున్నాయి. మీరా... నేనా.... అంటూ అన్ని పార్టీ నేతలు ఎన్నిలకలకు సంసిద్ధం అవుతున్నారు.

"సిద్ధం" సభలో .....

అధికారంలో ఉన్న వైస్సార్సీపీ పార్టీ తమ ,మేనిఫెస్టోని తయారు చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, మార్చ్ 10న బాపట్ల జిల్లా, మేదరమెట్ల వద్ద నిర్వహించ్చబోతున్న "సిద్ధం" సభలో తమ మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలకు, ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ ప్రభుత్వం. పోయిన సారి ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన వైస్సార్సీపీ ప్రభుత్వం, ఈ సారి ఎన్నికల మేనిఫెస్టో లో , సంక్షేమ పథకాలతో పాటు పలు అభివృద్ధి మార్గాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఈ సారి ఎలెక్షన్స్లో మొత్తం 175 స్థానాలను కైవసం చేసుకునేందుకు యత్నిస్తున్నారు.

మహా కూటమి....

మరోవైపు, ఈ సారి జరగబోతున్న ఎన్నికలకు టీడీపీ మరియు జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల మేలుకోసమే ఈ కూటమిని ఏర్పాటు చేసినట్లు, ఇరు పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తుంది మరియు మిగిలిన 24 స్థానాల్లో జనసేన పోటీకి దిగింది. దాదాపు అన్ని నియాజకవర్గాల అభ్యర్థులను రెండు పార్టీలు ఖరారు చేసారు. రాష్ట్రంలో అనేక చోట్ల పార్టీ మీటింగులు, వరుసగా నిర్వహిస్తున్నారు.

మొత్తం ఓటర్లు ....

ఆంధ్ర ప్రదేశ లో వచ్చే ఎన్నికలకు 4.08 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సారి కొత్తగా 5,86,530 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. మొత్తం ఓటర్లలో ఎక్కువమంది యుక్త వయసున్న వారేనని ఎలక్షన్ కమిషన్ నివేదిక విడుదల చేసింది. గెలుపెవరిదో లేదా ఓటమెవరిదో నిర్దేశించేది ఓటర్లే. కాబట్టి అందరూ తమ ఓటు హక్కును వినియోగించ్చుకొని తమ నాయకులను ఎన్నుకోవాలి.

Share your comments

Subscribe Magazine