News

AP HIGH COURT: 8 మంది IAS అధికారులకి శిక్ష, ప్రతి నెలలో ఒక రోజు సమాజ సేవ చేయాలనీ ఆదేశం

S Vinay
S Vinay

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులకు హైకోర్టు గురువారం శిక్ష విధించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయరాదన్న ఆదేశాలు అమలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార కేసులో 8 మంది ఐఏఎస్ అధికారులను దోషులుగా నిర్ధారించిన కోర్టు రెండు వారాల జైలు శిక్ష విధించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులకు హైకోర్టు గురువారం శిక్ష విధించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయరాదన్న ఆదేశాలు అమలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార కేసులో 8 మంది ఐఏఎస్ అధికారులను దోషులుగా నిర్ధారించిన కోర్టు రెండు వారాల జైలు శిక్ష విధించింది. అయితే ఐఏఎస్ అధికారులు క్షమాపణలు చెప్పడంతో హైకోర్టు శిక్షను రద్దు చేస్తూ ఐఏఎస్ అధికారులందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశించింది.విజయ కుమార్, శ్యామలరావు, గోపాల కృష్ణ ద్వివేది, శ్రీలక్ష్మి, బుడితి రాజశేఖర్, గిరిజా శంకర్, చిన్న వీరభద్ర, ఎంఎం నాయక్ వంటి ఐఏఎస్ అధికారులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఏడాది పొడవునా ప్రతి నెలా ఒకరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.


సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఏడాదికి ఒకరోజు భోజన ఖర్చును భరించాలని కోర్టు సూచించింది. ఒకరోజు కోర్టు ఖర్చులను కూడా ఐఏఎస్‌లు భరించాలని హైకోర్టు ఆదేశించింది.ఉన్నత పాఠశాల ఆవరణ, ఇతర ప్రభుత్వ స్థలాల్లో గ్రామ సచివాలయ భవనాలను నిర్మించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు కోర్టు ధిక్కార కేసు నమోదు చేసింది. కోర్టు ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోనందుకు కోర్టు ధిక్కార వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. విచారణ అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రాష్ట్రంలోని ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు రెండు వారాల జైలు శిక్ష విధించింది.

మరిన్ని చదవండి.

TELANGANA:పొలానికి దిష్టి ఇలా కూడా తీస్తారా ఈ రైతు ఏం చేసాడో చూడండి.

Share your comments

Subscribe Magazine