ఆంధ్ర ప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి, కొన్ని కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు, అందులో భాగంగా, టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం, సామజిక భద్రత పెన్షన్ను పెంచి 4000 రూపాయిలు చేసారు. దీనికి సంబంధించిన ఫైల్ పై చంద్రబాబు ఇప్పటికే సంతకం చేసారు. రాష్ట్రంలో గల 66 లక్షలమంది వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలు మరియు వితంతువులకు ఈ పెన్షన్ మార్పు వర్తించనుంది.
అంతేకాకుండా ఇప్పటివరకు అమలవుతున్న వైఎస్ఆర్ పెన్షన్ కనుక పేరును మార్చి, ఎన్టీఆర్ భరోసాగా మార్చనున్నారు. అయితే రానున్న జులై ఒకటి నుండి ఈ కొత్త పెన్షన్ను మొదలుపెట్టి, లబ్ధిదారులకు రూ.4,000 అందించనున్నారు. జులై నెలలో ఈ నాలుగువేలతో పాటు, గత ప్రభుత్వ హయాంలో, ఏప్రిల్ నుండి జూన్ వరకు అందించిన రూ.3,000 కు అదనంగా మరో 1,000 రూపాయిలు కలిపి ఆ మొత్తని జులై లో అందించనున్నారు.
జులైలో చెల్లించవలసిన 4,000 రూపాయలు మరియు ఏప్రిల్ నుండి జూన్ వరకు, చెల్లించవలసిన వెయ్యి రుపాయిలతో కలిపి, మొత్తం రూ.7,000 పింఛనుదారులకు అందించనున్నారు. ఇదిలాఉండగా, వికలాంగులకు జులై నేలనుండి రూ. 6000 అందించనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, మరియు వీల్-చైర్ కు పరిమితమైనవారికి ఇస్తున్న 5000 రూపాయిల పెన్షన్ను 15,000 రూపాయిలు చెయ్యనున్నారు. కాలేయం, కిడ్నీ, గుండె మార్పిడి చేపించుకున్నవారు, మరియు డైయలసీస్ అవసరమున్నవారుకి, ఇప్పటివరకు ఇస్తున్న పెన్షన్ 5,000 రూపాయిలను రేటింపు చేసి రూ.10,000 ఇవ్వనున్నారు. పేషన్ల కోసం ప్రభుత్వం మొత్తం 33 వేల కోట్లా రూపాయిలు ఖర్చు చెయ్యనున్నారు.
Share your comments