News

World Milk day 2024: ప్రపంచ పాల దినోత్సవం

KJ Staff
KJ Staff

ఈ రోజు ప్రపంచ పాల దినోత్సవం. మనిషి తీసుకునే ఆహారంలో ప్రదమైన పాత్ర పోషిస్తాయి పాలు. కేవలం ఆహారపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పాలను దేవుళ్ళ ఆహారంగాను భావిస్తారు. దైనందన జీవితంలో ఎంతో విశిష్టత కలిగిన పాల యొక్క ప్రత్యేకత గురించి ప్రజల్లో చైత్యనం కలిగించడం కోసం, ప్రతి ఏడాది జూన్ ఒకటో తారీఖున ప్రపంచ పాల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.

ప్రపంచంలో నీటి తరువాత ఎక్కువగా సేవించే పానీయాల్లో పాలు ఒకటి. మన భారతీయులకు టీ లేదా కాఫీ తాగనిదే రోజు గడవదు, వీటికి మూలం కూడా పాలే. ప్రపంచ పాల ఉత్పత్తిలో, భారత దేశం మొదటి స్థానంలో ఉంది, మన దేశంలో వ్యవసాయంతో తరువాత ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న రంగాల్లో పాల ఉత్పత్తి రంగం ఉంది, కొన్ని కోట్లా లక్షల మంది పశుపోషణనే తమ జీవనాధారంగా ఎంచుకొన్నారు.

పాలలో ఎన్నో పోషకవిలువలు మరియు ఖనిజాలు ఉన్నాయి, పాలను సంపూర్ణ ఆహారంగా కుడా ఫారిగణిస్తారు, ఎందుకంటే పాలలో మనకు అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మరియు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాల ద్వారా లభించే కాల్షియమ్ మరియు పోస్ఫోరోస్ ఎముకుల దృఢత్వానికి దోహదపడి, వాటి అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చిన్న పిల్లలకు ఎదిగే వయసులో ఈ ఖనిజాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి పాలే ప్రధాన ఆహారం. పాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడి మనల్ని రోగాల భారిన పడకుండా కాపాడగలవు. పాలు మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడగలవు.

అయితే పాలను మన ఆహారంగా ముందునుండి లేవు, క్రీస్తుపూర్వం 9000-8000 మధ్యకాలంలో మొదటిసారి పశువుల పోషణ మొదలయ్యింది ఆ తరువాత పాలు మన ఆహారంలో ఒక భాగమైపోయాయి. మన భారతీయులతోపాటు, గ్రీకు వారు, ఈజిప్ట్ వారు, రోమన్లు పాలను ఎంతో పవిత్రమైనవి గా భావించి వాటిని దేవుళ్ళ ఆహారంగా భావించేవారు. ఇప్పటికే మన దేశంలో దేవునికి నివేదించే నైవేద్యంలో పాలు లేదా పాలతో చేసిన వంటకాలు తప్పనిసరి. కేవలం పాలు మాత్రమే కాకుండా పాలతో పదార్ధాలు కూడా మన ఆహారంలో భాగమైపోయాయి, వీటిలో పెరుగు, వెన్న, నెయ్యి, చీజ్ మరియు పన్నీరు ముఖ్యమైనవి. మన ఆహారంలో పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబ్బటి పాల మీద వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది, ప్రస్తుతం పాల మరియు పాల పదార్ధాల ఉత్పత్తి కేంద్రలెన్నో వెలిసాయి.

Share your comments

Subscribe Magazine