ఏప్రిల్ 4వ తేదీ నుంచి పాఠశాల సమయాన్ని ఒక్క పూట కు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నా
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక్క పూట బడులు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు .
ప్రతిరోజూ ఉదయం 7.30 గంటలకు క్లాసు పనులు ప్రారంభమై 11.30 గంటలకు ముగుస్తాయని మంత్రి తెలిపారు.
ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలుకానున్నాయి . ఎస్ఎస్సీ పరీక్షలు ఏప్రిల్ 27న, ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి వాటికీ సంబందించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు అయన వెల్లడించారు .
ఒక్క పుట పాఠశాలలను నడపాలని ప్రభుత్వాన్ని కోరిన బాలల హక్కుల పరిరక్షణ ఫోరం మరియు విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేశాయి.
Share your comments