ఎండల వేడికి ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్రానికి వాతావరణ శాఖ, చల్లబడే కబురు అందించి. జూన్ మొదటివారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తుంది. దీని వలన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో మగ్గిపోతున్న రాష్ట్రం కాస్త చల్లబడుతుంది. మే 31 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని చేరతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నైరుతి రుతుపవనాలు జూన్ మొదటివారంలో కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రుతుపవనాలు మే 31 కి కేరళ తీరని తాకినట్లైతే ఆ తర్వాత రెండు, రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడితే వర్షాలు మరింత ముందే రావచ్చు.
దక్షిణ తమిళనాడు నుండి, లక్షద్వీప్ వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది, దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రమంతటా తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే సూచనా ఉంది, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ ద్రోణి ప్రభావం కారణంగా గురువారం, కోనసీమ జిల్లా, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి, అదేవిధంగా నేడు, తిరుపతి, వైఎస్అర్ కడప , నెల్లూరు, కర్నూల్ మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిసాయి.
అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్ మొదటివారంలోనే నైరుతిరుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉంది కాకపోతే ప్రస్తుతం పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ఉపరితలం మీద ద్రోణి వ్యాపించి ఉంది. ఇది అల్పపీడనం లాగా మారితే, నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడం కాస్త ఆలస్యం అవుతుంది.
Share your comments