News

LIC నుంచి మరో అద్భుతమైన పాలసీ.. రూ. 22 లక్షలు పొందే అవకాశం!

Srikanth B
Srikanth B

సామాన్యులకు ఇన్సూరెన్సు అనగానే గుర్తుకు వచ్చేది LIC లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అందించే అద్భుతమైన పాలసీలు అంతేకాకుండా LIC మంచి రిటర్న్ ను తీసుకు వచ్చే పాలసీలను కూడా అందిస్తుంది .అంటువంటిదే ఎప్పుడు LIC తీసుకొచ్చిన 'ధన్‌ సంచయ్‌' పాలసీ ను తీసుకొచ్చింది .

 

అధిక మొత్తంలో పాలసీ తీసుకోవాలి చూసే వారికోసం ‘ధన్‌ సంచయ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీలో వినియోగదారులకు మొత్తం 4 రకాల ఆప్షన్స్‌ అందించింది. ఈ పాలసీ తీసుకున్న వారికి లోన్‌తోపాటు కచ్చితమైన రిటర్న్ ఇన్‌కమ్‌ కూడా అందిస్తోంది. ‘ధన్‌ సంచయ్‌ పాలసీ లో A,B,C,D అనే ఆప్షన్స్‌లో పాలసీ తీసుకోవచ్చు .

ఈ స్కీమ్‌లో చేరడానికి లబ్దిదారుడి వయసు కనీసం మూడేళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితి A, Bలకు 50 సంవత్సరాలు, Cకి 65 సంవత్సరాలు, D పరిమితి 40 సంవత్సరాలు. ఇక పాలసీ తీసుకోవాలనుకునే వారు ఏడాదికి కనీస ప్రీమియంగా రూ. 30,000గా ఉంది. 5, 10 లేదా 15 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఈ ప్లాన్‌లో కనిష్టంగా రూ. 2.5 లక్షలు గరిష్టంగా రూ. 22 లక్షల వరకు మెచూరిటీ మొత్తాన్ని పాలసీ దారుడు పొందొచ్చు.


పాలసీ కడుతూ మధ్యలో లబ్ధిదారుడు మధ్యలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఈ పాలసీ యొక్క మొత్తం ఆర్థిక ప్రయోజనాలు అందిస్తారు. పాలసీ కాలం 5 నుంచి 15 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది. డెత్ బెనిఫిట్స్ ఒకేసారి లేదంటే ఐదేళ్ల పాటు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారు. ఇది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, సేవింగ్ ప్లాన్. ఇక నాలుగు ఆప్షన్స్‌ విషయానికొస్తే A, B ఆప్షన్స్‌లో హామీ మొత్తం కనీసం రూ. 3,30,000, ఆప్షన్ C లో రూ. 2,50,000, D లో రూ. 22,00,000గా ఉంటుంది.

Related Topics

lic policy

Share your comments

Subscribe Magazine

More on News

More