News

రైతులకు సున్నా వడ్డీకి రూ.5 లక్షల వరకు రుణం .. ఎక్కడో తెలుసా !

Srikanth B
Srikanth B

2023 లో దాదాపు 9 రాష్ట్రాల అసెంబ్లీ కు ఎన్నికలు జరగనున్నాయి ఇదే క్రమంలో కొన్ని రాష్ట్రాలు బడ్జెట్ ఒక అస్త్రంగా ఉపయోగించు కొని ఎన్నికలో విజయం సాధించాలని చూస్తున్నాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో రైతన్నలను ఆకట్టుకునేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రైతులపై కానుకల వర్షము కురిపించారు.

రైతులకు ఇచ్చే సున్నా వడ్డీల రుణ పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ సమర్పణ సమయంలో ఈ మేరకు బొమ్మై వెల్లడించారు.


కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 30 లక్షల మందికి పైగా రైతులకు రూ.25 వేల కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ హోల్డర్లకు ‘భూ సిరి’ పథకం కింద 2023-24 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.2,500, నాబార్డ్ అందజేసే రూ.7,500లతో కలిపి మొత్తం రూ.10,000 సబ్సిడీ ఇవ్వనున్నట్లు బొమ్మై తెలిపారు.

రైతులకు శుభవార్త.. ఈ తేదీన అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు..

. మహిళా రైతు కూలీలకు ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ. 500 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ‘శ్రమ శక్తి’ పథకాన్ని కూడా సీఎం బడ్జెట్‌లో ప్రకటించారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్-మేలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఎలాంటి బడ్జెట్ కేవలం ఎన్నికల కోసం ప్రకటించింది మాత్రమే అనని ప్రతి పక్షాలు విమర్శలు గుపిస్తున్నాయి .

రైతులకు శుభవార్త.. ఈ తేదీన అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు..

Related Topics

check pm kisan status

Share your comments

Subscribe Magazine