News

రైతులకు శుభవార్త.. ఈ తేదీన అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు..

Srikanth B
Srikanth B

రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న PM KISAN అప్డేట్ రానే వచ్చింది , ఇప్పటికే 12 వ విడతను విడుదల చేసిన ప్రభుత్వం 13 వ విడత పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు , ఎప్పటి నుంచో నిన్న రేపు అని ఊరిస్తున్న 13 విడత డబ్బులు హోలీ సమయానికి విడుదల అవుతాయని అందరు భావించిన అంతకన్నా ముందే డబ్బులను విడుదల చేయాలనీ ప్రభుత్వం ,భావిస్తుంది .

వివిధ మీడియా సంస్థలకు అందిన సమాచారం మేరకు PM కిసాన్ 13 వ విడత ఫిబ్రవరి 24 న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి .


ఫిబ్రవరి 24న కేవలం పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు మాత్రమే కాకుండా ఏపీ ప్రభుత్వం కూడా ఆ రోజున రైతు భరోసా డబ్బులను అందించనుంది. అంటే రైతులకు డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 13వ విడత పీఎం కిసాన్ డబ్బులును రైతులకు అందించాల్సి ఉంది. సంక్రాంతి పండుగకే ఈ డబ్బులు వస్తాయని గతంలో నివేదికలు వెలువడ్డాయి. అయితే అలా జరగలేదు. ఇప్పుడు ఫిబ్రవరి 24న డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయని తెలుస్తోంది.


ఇకపోతే పీఎం కిసాన్ డబ్బులు పొందాలని భావించే రైతులు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఎవరైతే ఇకేవైసీ చేసుకంటారో వారికే ఈ 13 వ విడతల డబ్బులు అందనున్నాయి.

గిట్టుబాటు ధర రాక పంటను అమ్ముకోలేని దుస్థితిలో మిర్చి రైతులు ..


PM కిసాన్ ఆఫ్‌లైన్ నమోదు ప్రక్రియ:

పిఎం కిసాన్ పథకం కోసం నమోదు చేసుకోవడానికి రైతులు స్థానిక రెవెన్యూ అధికారి (పట్వారీ) లేదా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన నోడల్ అధికారిని సందర్శించాలి. అంతేకాకుండా, వారు రిజిస్ట్రేషన్ కోసం సమీపంలోని సాధారణ సేవా కేంద్రాలను (CSCలు) సంప్రదించవచ్చు. మీరు చేయాల్సిందల్లా అన్ని ముఖ్యమైన పత్రాలను తీసుకుని, CSC వద్ద ఉన్న అధికారికి సమర్పించండి.

PM కిసాన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ:
స్వీయ-నమోదు కోసం, PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి . ఇప్పుడు హోమ్‌పేజీకి కుడి వైపున 'రైతుల మూల' విభాగం కోసం చూడండి. ఆపై 'కొత్త రైతు నమోదు'పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రెండు ఎంపికలను కనుగొంటారు - గ్రామీణ రైతు నమోదు మరియు పట్టణ రైతు నమోదు. మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే, మొదటి ఎంపికను ఎంచుకోండి లేదా రెండవదాన్ని ఎంచుకోండి.

PM-కిసాన్ యోజన కోసం అవసరమైన పత్రాలు:
ఆధార్ కార్డు
మొబైల్ నంబర్
ల్యాండ్ హోల్డింగ్ పేపర్లు
బ్యాంక్ ఖాతా వివరాలు
PM కిసాన్‌కు ఎవరు అర్హులు?
తమ పేరుతో సాగు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు
పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు

గిట్టుబాటు ధర రాక పంటను అమ్ముకోలేని దుస్థితిలో మిర్చి రైతులు ..

Related Topics

PMKISANSAMANNIDI

Share your comments

Subscribe Magazine