News

గిట్టుబాటు ధర రాక పంటను అమ్ముకోలేని దుస్థితిలో మిర్చి రైతులు ..

Srikanth B
Srikanth B

మిర్చి పంటను సాగు చేసే రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి . ఒకవైపు పెరుగుతున్న పెట్టుబడి మరోవైపు తెగుళ్ల దాడితో తగ్గుతున్న దిగుబడి తీరా పంట చేతికి వచ్చాక మర్కెటుకు తీసుకెళ్తే దళారుల దోపిడీ కారణంగా మిర్చి రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు .

 

ఇటువంటి వేదననే జోగులాంబ గద్వాల జిల్లా మిర్చి రైతులు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . జనవరిలో 25వేలు పలికిన ఎండు మిరప ధర, ప్రస్తుతం 15 నుంచి 18వేలు పలుకుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు, తెగుళ్లదాడితో నష్టాల్లో ఉన్న తమకు. మార్కెట్ ధరలు శాపంగా మారయాంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు 25వేల మంది రైతులు 36వేల ఎకరాల్లో మిరప సాగు చేస్తారు. ఈ ఏడాది విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులన్నీ కలిపి ఎకరాకు లక్ష రూపాయలకు పైగానే పెట్టుబడి పెట్టారు. గత సంవత్సరం ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిన మిరప..తామరపురుగు, ఆకుముడత తెగుళ్ల కారణంగా ఎకరాకు 2 నుంచి 10 క్వింటాళ్లకే పరిమితమైంది.జనవరిలో సూపరైన్ వంటి మిరపపంటకు మార్కేట్లో 26 వేలు పలకడంతో.. దిగుబడి తగ్గినా ధర బాగానే ఉందని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం క్వింటాల్‌కి 15 నుంచి 18 వేలకు తగ్గింది.

వరంగల్ మార్కెట్లో గోల్డెన్ కలర్ మిర్చి ... ధర ఎంత పలికిందో తెలుసా !

మరోవైపు వరంగల్ ఇనుమల మార్కెట్ లో మాత్రం దేశీయ రకం మాత్రం ఈ ఏడాది 81 వేలు ధర పలుకుతూ రికార్డు సృష్టించింది , ఇతర రకాల మిర్చి కంటే దేశీయ మిర్చి రకానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ వుంది .

వరంగల్ మార్కెట్లో గోల్డెన్ కలర్ మిర్చి ... ధర ఎంత పలికిందో తెలుసా !

Share your comments

Subscribe Magazine