రైతులను ఆదుకొని పంట సాగును ప్రోస్తహిందడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పధకాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాయి. ఈ వివిధ రకాల పథకాల వల్లా రైతులు ఆర్ధికంగా బలపడి పంటలను సాగు చేస్తున్నారు. దీనితో పాటు రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణి చేయడం మరియు పంటకు వాడే ఎరువులపై సబ్సిడీలను అందించడం ఈ విధంగా అనేక రకాలుగా ప్రభుత్వాలు రైతులకు అండగా నిలుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రైతులకోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పధకాన్ని ప్రారంభించిన సంగతి మనకి ఎప్పుడో తెలిసిందే. ఈ రైతు భరోసా పథకంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి నేరుగా డబ్బులను ప్రతి సంవత్సరం వేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం నాలుగో ఏడాది 3వ విడతను విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మరొక అవకాశాన్ని ఇచ్చింది. ఎవరైనా రైతులకు ఈ పథకానికి అర్హత ఉండి వారికి డబ్బులు అందకపోతే లేదా కొత్తగా పొలం పాస్ బుక్ చేయించుకున్న దానికి సంబంధించిన పత్రాలు తీసుకోని వెంటనే రైతు భరోసా పథకంకు అప్లై చేసుకోండి. ఒకవేళ రైతులు తమ భూమికి కొత్త పాస్ బుక్ పొందితే, దానికి ఆధార్ లింక్ కచ్చితంగా చేయించుకోండి.
ఇది కూడా చదవండి..
ప్రజలకు గుడ్ న్యూస్: 'ఫ్యామిలీ డాక్టర్'తో ఇంటికే వైద్య సేవల కార్యక్రమం..
రైతు భరోసా పథకం కొరకు దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
1. ఆధార్ కార్డ్
2. ఒరిజినల్ 1B
3. ఫోన్ నెంబర్
4. బ్యాంక్ అకౌంట్
ప్రతి విడతకు రూ.2 వేలా చొప్పున ప్రతి రైతు యొక్క ఖాతాలోకి జమచేస్తున్నారు. ఈవిధంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి రూ.27,062.92 కోట్లను వేసి వారికీ ఆర్హిక సహాయం చేసారు. ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చాలా బాగా ఉపయోగపడి వారికీ అండగా నిలుస్తుంది.
ఇది కూడా చదవండి..
Share your comments