News

సామాన్యులపై మరో పిడుగు.. భారీగా పెరిగిన ధరలు..

Gokavarapu siva
Gokavarapu siva

సామాన్యులకు ఇది పిడుగులాంటి వార్తే అని చెప్పాలి. ఏదైనా పండగ వచ్చిన లేదా ఇంటికి చుట్టాలు వచ్చిన రుచికరమైన వంటకాలను చేసి పెడతాము. ఆ వంటలకు అంతలా రుచి రావటానికి వాటిలో సుగంధ ద్రవ్యాలు వాడతాం. ప్రపంచంలోనే అత్యధికంగా సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేసే దేశం మన భారతదేశం. ప్రస్తుతం ఈ సుగంధ ద్రవ్యాల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ సుగంధ ద్రవ్యాల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సర్వేలు కూడా చెబుతున్నాయి.

దేశంలో మొత్తానికి మసాలా దినుసుల రేట్లు భారీగా పెరిగాయి. ఈ అధిక ధరల కారణంగా సామాన్య ప్రజలు వీటిని కొనడానికి కూడా ఆలోచించాల్సివస్తుంది. సంవత్సర వ్యవధిలోనే కొన్ని సుగంధ ద్రవ్యాలు 50 శాతం వరకు ధరలు పెరగడం ఇదే మొదటి సారి. పంటలపై వాతావరణ ప్రభావం చూపడంతో వీటి ధరలు అత్యధికంగా పెరిగినట్లు చెబుతున్నారు. దానితోపాటు అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. వ్యాపారం కూడా దెబ్బతినిందని వ్యాపారస్తులు చింతిస్తున్నారు.

ఎన్నడూ లేని విధంగా ఈ ధరలు పెరగడంతో అనేక మసాలా దినుసులకు సంబంధించి హోల్‌సేల్ అండ్‌ రిటైల్ మధ్య ధరల వ్యత్యాసం అనేది సుమారుగా రెట్టింపు అయ్యాయి. దీని ప్రభావం ఎక్కువగా వినియోగదారుల జేబులపైనే పడుతోంది. ఈ మసాలా దినుసులలో ఎక్కువగా మిరపకాయలు, జీలకర్ర, లవంగాల ధరలు బాగా పెరిగాయి.

ఇది కూడా చదవండి..

మహిళలకు శుభవార్త: ఈ నెల 12న వారి ఖాతాల్లోకి రూ.15 వేలు..

భారతదేశం ప్రపంచంలోనే అధిక జీలకర్రను ఉత్పత్తి చేస్తూ మొదటి స్థానంలో ఉంది. సుమారుగా 70 శాతం జీలకర్ర మనదేశంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇందులో 35 శాతం ఎగుమతి చేస్తూ అతిపెద్ద ఎగుమతిదారుగా కూడా నిలిచింది. అలాంటిది దేశంలో జీలకర్ర ధరలు ఆకాశానంటుతున్నాయి. రైతులు కూడా అధిక ధరలు వస్తున్నా ఇతర పంటలను సాగు చేయడం వలన ఈ జీలకర్ర ధరలు బాగా పెరిగాయి. దీనితో ప్రపంచ మార్కెట్ పై కూడా ప్రభావం చూపుతుంది.

దేశ వ్యాప్తంగా జీలకర్ర ధర భారీ స్థాయిలో పెరిగింది. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి తక్కువగా ఉన్నందున జీరా ధరలు సంవత్సరానికి 72 శాతం పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తక్కువ దిగుబడి, సాగు విస్తీర్ణం తక్కువగా ఉండటం, రైతులు జీలకర్ర కంటే ఎక్కువ ధరలు ఉన్న పెసర, ఆవాలకి మారడం వలన జీరా దిగుబడి తక్కువగా ఉంది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా జీరాను అత్యధికంగా ఉత్పత్తి చేసే భారత్‌లో రికార్డ్ స్థాయిలో ధరలు పెరగడం వలన ఇతర ప్రపంచ మార్కెట్‌లపై జీరా ప్రభావం పడనుంది.

ప్రపంచంలోనే అత్యధిక జీలకర్ర ఉత్పత్తిలో భారతదేశం 70 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. దేశీయంగా జీలకర్రలో 40 శాతం వాటాను కలిగి ఉన్న గుజరాత్‌లోని మండిలో ఏప్రిల్‌లో ధరలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో కూడా సుగంధ ద్రవ్యాల ధరలు అందనంత ఎత్తుకు ఎదిగాయి.

ఇది కూడా చదవండి..

మహిళలకు శుభవార్త: ఈ నెల 12న వారి ఖాతాల్లోకి రూ.15 వేలు..

కరోనా సమయం తరువాత మార్కెట్ మళ్ళి చక్కపడింది. కానీ ఇటీవలి దేశంలో కురిసిన అకాల వర్షాల కారణంగా ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయని బాధిత రైతులు మొత్తుకుంటున్నారు. అదేవిధంగా జీలకర్ర పంట చేతికి వచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు కురవడం వలన అధిక మొత్తంలో ఈ జీలకర్ర పంట పాడయిపోయింది. దీనితోపాటు మార్కెట్‌ నుండి నల్ల వ్యాపారులు అధిక మొత్తంలో మసాలా దినుసులను కొని విదేశాలకు తరలిస్తున్నారని దీనితో సుగంధ ద్రవ్యాల రేటు పెరగడానికి కారణమని అంటున్నారు.

– ఇంగువ గతంలో కిలో రూ.10000 ఉండగా ఇప్పుడు సుమారుగా 25 నుంచి రూ.30000 వరకు కిలో విక్రయిస్తున్నారు.

– జీలకర్ర గత కొన్ని రోజులుగా కిలో రూ.100 పెరిగి రూ.280 నుండి రూ.450కి పెరిగింది.

– ఎర్ర మిర్చి కిలో రూ.160 నుంచి రూ.250 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు.

ఇది కూడా చదవండి..

మహిళలకు శుభవార్త: ఈ నెల 12న వారి ఖాతాల్లోకి రూ.15 వేలు..

Related Topics

spices prices

Share your comments

Subscribe Magazine