ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి ఈరోజు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు . ఈ సంవత్సరం ఎక్కువగా బడ్జెట్ లో విద్య, వైద్య మరియు మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్ అనేది రూ.2.70 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ సంవత్సరం సంక్షేమ పథకాలపై ఎక్కువ కేటాయింపులు ఉంటాయని వెల్లడించారు .
రైతులకు పెట్టుబడి సాయంగా అందించే పథకం రైతు భరోసాపెట్టుబడి సాయని మూడు విడతలలో రైతులకు అందిస్తుంది ప్రభుత్వం ,రైతు భరోసా కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి అన్నదాతల సంక్షేమం కోసం వైయస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కోసం రూ.4,020 కోట్లు కేటాయించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం .
వ్యవసాయ రంగానికి కేటాయింపులు :
వ్యవసాయ శాఖకు రూ.12,450 కోట్లు కేటాయింపు.
పగటి పూట రైతులకు 9 గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగుతోందని తెలిపారు. విద్యుత్ సబ్సిడీ కోసం రూ.5,500 కేటాయింపు. ఆర్బీకేల ద్వారా రూ.450 కోట్లు విలువైన ఎరువుల పంపిణీ.
రైతుల కోసం వ్యవసాయ సహాయక మండళ్లు ఏర్పాటు.విత్తనాల పంపిణీ కోసం రూ.220 కోట్లు కేటాయింపు.
వ్యవసాయ రుణాల కింద 9 లక్షల మంది రైతులకు లబ్ది జరిగిందన్న మంత్రి. వైఎస్సాఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించామని, ఈ పథకం కోసం రూ.1,442 కోట్లు కేటాయింపు.
రూ.2.70 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్..
రైతులకు ఉచిత పంటల బీమా కోసం రూ. 1,600 కోట్లు ప్రతిపాదించినట్టు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ రూ.6,400 కోట్లు నాలుగేళ్లలో అందజేసినట్టు తెలిపింది.
మత్స్య శాఖ కోసం రూ.538 కోట్లు కేటాయింపు. పశు సంవర్ధక శాఖకు మొత్తం రూ.1,114 కోట్లు కేటాయింపు.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.472 కోట్లు. డాక్టర్ వైస్సాఆర్ ఉద్యానవన యూనివర్సిటీ కోసం రూ.102 కోట్లు..వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.138 కోట్లు.. ఏపీ మత్స్య యూనివర్సిటీకి రూ.27 కోట్లు
ఉద్యానవన శాఖకు మొత్తం రూ.664 కోట్లు కేటాయింపు.
Share your comments