News

రూ.2.70 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్..

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి ఈరోజు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సంవత్సరం ఎక్కువగా బడ్జెట్ లో విద్య, వైద్య మరియు మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్ అనేది రూ.2.70 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ సంవత్సరం సంక్షేమ పథకాలపై ఎక్కువ కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు.

కేబినెట్ 2023-24 సంవత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. దీనితోపాటు ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్ ను కూడా ఆమోదించింది. ప్రస్తుతం వరుసగా ఐదో దఫా ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పథకాలను కొనసాగిస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నిలుస్తూ ఈ సంవత్సరం బడ్జెట్ను ప్రభుత్వం తయారుచేసింది. ఈ సంవత్సరం మహిళా సాధికారతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.

ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఐదో బడ్జెట్‌ జనరంజకంగా ఉండనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌ ను ఉదయం 8 గంటలకు ఆమోదం తెలిపింది. ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2023-24 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో సమర్పించారు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త.. ధరణిలో FAQ ఆప్షన్ .. రైతుల అన్ని సమస్యలకు సమాధానం !

గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం సబ్సిడీకి తగినన్ని నిధులు కేటాయించనున్నారు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త.. ధరణిలో FAQ ఆప్షన్ .. రైతుల అన్ని సమస్యలకు సమాధానం !

Related Topics

ap budget 2023

Share your comments

Subscribe Magazine