News

నేడు వైస్సార్ యాత్ర సేవాపథకం క్రింద రైతులకు ట్రాక్టర్లు ,హార్వెస్టర్ ల పంపిణి

Srikanth B
Srikanth B
నేడు వైస్సార్ యాత్ర సేవాపథకం క్రింద రైతులకు ట్రాక్టర్లు ,హార్వెస్టర్ ల పంపిణి
నేడు వైస్సార్ యాత్ర సేవాపథకం క్రింద రైతులకు ట్రాక్టర్లు ,హార్వెస్టర్ ల పంపిణి

జూన్ 2న నేడు చుట్టుగుంట సెంటర్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ట్రాక్టర్లు, అత్యాధునిక వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్నారు. 26 జిల్లాల రైతులకు 2,550 ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను సీఎం పంపిణీ చేయనున్నారు.

గుంటూరు మిర్చి యార్డు ఆవరణలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ట్రాక్టర్లను ఉంచనున్నారు. అనంతరం జూన్ 2న అనగా నేడు ముఖ్యమంత్రి చేతులమేదిగా రైతులకు ట్రాక్టర్లను మరియు హార్వెస్టర్ లను రైతులకు అందించనున్నారు .

ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల మెగా పంపిణీ.. రాష్ట్రస్థాయి రెండో మెగా పంపిణీలో భాగంగా రూ. 361.29 కోట్ల విలువ గల 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను గుంటూరు నగరంలోని చుట్టుగుంట సర్కిల్ లో పంపిణీ చేయడంతో పాటు రూ.125.48 కోట్ల సబ్సిడీని నేడు రైతన్నల గ్రూపుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .

రైతు భరోసా ,పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసిన సీఎం జగన్ .. రాకుంటే ఈ నెంబర్ కు కాల్ చేయండి !


వైఎస్సార్ యంత్ర సేవా పథకం:


గ్రామాల్లో రైతులు గ్రూపులు గ ఏర్పడి వారి వ్యవసాయ అవసరాలకు కావాల్సిన పరికరము ఎంచుకోవచ్చు , పంటల సరళి, స్థానిక డిమాండ్ కు అనుగుణంగా కావలసిన యంత్ర పరికరాలను ఎంపిక చేసుకోవడంలో రైతు గ్రూపుల తుది నిర్ణయం...
అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలు, వాటి సరసమైన అద్దె, సంప్రదించవలసినవారి వివరాలు పారదర్శకంగా ఉండేలా సేవలన్నీ ఆ ప్రాంత రైతులకు అందేలా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించబడుతుంది .

సులభతరంగా యంత్రాలను బుక్ చేసుకోవడానికి వీలుగా "వైఎస్సార్ యంత్ర సేవా యావ్" ను విడుదల చేసిన ప్రభుత్వం.. దీని ద్వారా రైతులు వారికి కావాల్సిన వ్యవసాయ పరికరాలను 15 రోజుల ముందుగానే బుక్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తుంది . ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యవసాయ పనిముట్లు ,డ్రోన్లు , స్ప్రేయర్లు మరియు 50 శాతం రాయితీ పై అందిస్తుంది .

రైతు భరోసా ,పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసిన సీఎం జగన్ .. రాకుంటే ఈ నెంబర్ కు కాల్ చేయండి !

Related Topics

ysr aasara

Share your comments

Subscribe Magazine