ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం గ పీఎం కిసాన్ ను కలుపుకొని సంవత్సరానికి 3 మూడు దఫాలలో 13500 రూపాయలను ఆర్థిక సాయంగా అందిస్తున్న డబ్బులను జూన్ 1 న కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి డబ్బులను విడుదల చేసారు . 2023-24 సంవత్సరానికి మొదటి విడతలో రైతుభరోసా 5500 వేలు విడుదల చేసారు అయితే రైతులకు ఇంకా అందాల్సిన రూ . 2000 రూపాయల విడుదల తేదీపై మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు .
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ వంతు వాటాను పీఎం కిసాన్ రైతుభరోసా క్రింద 5500 వేలు విడుదల చేసారు మిగిలిన రూ . 2000 వేలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి క్రింద జూన్ లేదా జులాయి నెలలో విడుదల చేసే అవకాశం ఉంది .
పీఎం కిసాన్ రైతుభరోసా క్రింద 3 విడతల్లో రూ. 13.500.. ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ. 7.500. అక్టోబర్ నెల ముగిసేలోపే ఖరీఫ్ పంట కోత సమయం. రబీ అవసరాల కోసం రూ. 4,000. పంట ఇంటికి వచ్చే సమయాన, జనవరి/ఫిబ్రవరి నెలలో రూ. 2,000 ఇలా మూడు దఫాలలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .
రైతులకు శుభవార్త: సబ్సిడీతో ఆర్బికేలా ద్వారా విత్తనాల పంపిణీ ప్రారంభం..
రైతు వారి ఖాతాలలో డబ్బులు వచ్చాయో లేదో చాల సులువుగా తెలుసుకోవచ్చు .
మొదట https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html లింక్ పై క్లిక్ చేయండి .
ఇప్పుడు మీ కుడివైపు know your status అనే ఎంపిక పై క్లిక్ చేయండి .
తరువాత మీకు 2023-24 సంవత్సరం రైతు భరోసా స్టేటస్ కనిపిస్తుది దానిపై క్లిక్ చేయండి .
2023-24 స్టేటస్ పై క్లిక్ చేసిన తరువాత మీ ఆధార్ నెంబర్ ను టైప్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి .
ఇప్పుడు మీకు మీ రైతు భరోసా స్టేటస్ కనిపిస్తుంది.
Share your comments