ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పులు రూ.10.57 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఒకవేళ తానూ చెప్పిన లెక్కలు గనుక తప్పు అన్నట్లయితే, దానికి తగిన ఆధారాలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చూపించి నిరూపించాలి అని ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఎంను సవాల్ చేశారు.
ఢిల్లీలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి వచ్చిన స్పందనపై అసంతృప్తిని పంచుకున్నారు. పూర్తిగా అబద్ధం చెప్పనప్పటికీ, మంత్రి అసలు విషయాన్ని మాత్రం చెప్పలేదు అని అన్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పరిస్థితిపై పూర్తి సమాచారం నాకు తెలుసు అని రఘురామకృష్ణరాజు అన్నారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (FRBM) నిబంధనల ద్వారా నిర్దేశించిన పరిమితులను మించి, రాష్ట్రం అధికంగా అప్పులను తీసుకుందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల రుణ పరిమితిని కేటాయించగా, ఇప్పటికే రూ.29,200 కోట్ల మేర అప్పులు చేసేసింది, ఇంకా కేవలం రూ.750 కోట్లు మాత్రమే మిగిలాయి. అయినప్పటికీ, జగన్ ప్రభుత్వం రూ.3,000 కోట్ల అదనపు రుణం కోసం ప్రయత్నిస్తోందని అన్నారు. ఏ లెక్కన ఈ రుణమిస్తారో అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం భాజపా పాలిత రాష్ట్రాలకూ అదనంగా అప్పులివ్వడం లేదు. కేరళ ప్రభుత్వం అదనంగా రూ.10 కోట్ల అప్పు తీసుకుందని కేంద్రం కాల్చుకు తింటోంది.
ఇది కూడా చదవండి..
గుడ్ న్యూస్! భారీగా తగ్గిన టమాటా ధరలు.. కిలోకు రూ.50 పతనం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి ఇటీవల పరిస్థితిని తెలుసుకుని, నిర్మలా సీతారామన్‌తో సంబంధిత వివరాలన్నీ పంచుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పరిస్థితిని వివరించే ప్రయత్నంలో రఘురామ ఇప్పటికే రెండుసార్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అధికారులతో, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సోమనాథన్‌తో మూడుసార్లు కలిశారు.
ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచేందుకు జగన్ ప్రభుత్వం రాష్ట్ర జిఎస్‌డిపి పెరిగినట్లు తప్పుడు లెక్కలను చూపిస్తుందన్నారు. నిజంగానే జీఎస్డీపీ పెరిగితే ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు ఉందని రఘురామ ప్రశ్నించారు. కార్పొరేషన్ల పేరిట చేస్తున్న దొంగ అప్పులను తెలియనీయడం లేదు.
వీటికి సంబంధించి కేంద్రానికి లేఖలు పంపుతున్న, ఈ లేఖలకు స్పందించిన కేంద్రం ఈ రుణాల వివరాలను వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ దోచుకున్న అప్పులపై పురందరేశ్వరి చురుగ్గా పోరాడుతున్నారని, ప్రధాని మోదీ త్వరలోనే నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..
Share your comments