News

గుడ్ న్యూస్! భారీగా తగ్గిన టమాటా ధరలు.. కిలోకు రూ.50 పతనం

Gokavarapu siva
Gokavarapu siva

టమాటో లేనిది కూర ఎలా వండాలి అని ఆలోచించే స్థాయికి టమాటో మరియు మనుషులకు బంధం ఏర్పడింది . పెరిగిన ధరలతో ఇప్పుడు వంటగదిలో టొమాటోలు కనిపించకుండా పోతున్నాయి. సామాన్య ప్రజలు కూడా ఈ టమోటా ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ టమోటా ధరల తగ్గుదల రాజధాని ఢిల్లీ నుండి ప్రారంభమైంది.

తాజాగా ఢిల్లీలో శుక్రవారం కిలో టమోటా ధరలో రూ.50 తగ్గుదల నమోదయింది. ప్రస్తుతం ఢిల్లీ యొక్క మండీల్లో కిలో టమోటాకు రూ.50 తగ్గించి రూ.150కి కిలో టమోటాలను అమ్ముతున్నారు. కాగా ఢిల్లీ మండీల్లో గురువారం వరకు రూ.180 నుంచి 200 వరకు కిలో టమోటాలను విక్రయించారు. అయితే రానున్న రోజుల్లో టమాటా ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

స్థానిక వ్యాపారులతో మాట్లాడగా.. గతంలో కిలో రూ.180 నుంచి రూ.200 వరకు పలికిన టమాటా ఇప్పుడు రూ.150కి పడిపోయిందని తెలిపారు. ఘాజీపూర్‌కు చెందిన ఆదితి బన్షీ లాల్ మాట్లాడుతూ, నేను 40 ఏళ్లుగా ఘాజీపూర్ మండిలో ఉన్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా టమోటా ధరలు పెరిగాయని ఆయన అన్నారు. ఈ పెరుగుదలతో కొనుగోళ్లలో క్షీణతకు దారితీసింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాట రూ.120 నుంచి 150 వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..

వాలంటీర్లకు ఏపీ సీఎం శుభవార్త.. త్వరలోనే రెట్టింపు కానున్న జీతాలు..

టమాట ధర రూ.50 తగ్గడంతో మార్కెట్‌లో టమాటా కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ ధర తగ్గడానికి ప్రస్తుతం వర్షపాతం తగ్గుదల కారణంగా అనే చెప్పవచ్చు. అందుకే హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి రోజూ సరిపడా టమాటాలు సరఫరా అవుతున్నాయి.
కర్నాటకలో వర్షాలుతగ్గడంతో ప్రతిరోజూ తగినంత పరిమాణంలో టమోటాలు సరఫరా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బెంగళూరు నుంచి కూడా టమోటాలు మండీలకు రవాణా అవుతున్నాయి.

ఘాజీపూర్ మండిలో ప్రస్తుతం టమాటా సరఫరా డిమాండ్‌కు తగ్గట్టుగా ఉందని, ఇది టమాటా ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణమని ఏజెంట్ ఇమ్రాన్ అన్నారు. మండావలిలో సందడిగా ఉన్న రిటైల్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో టమాట రూ.200 పలుకుతోంది. ఈరోజు టమాటా ధరలు స్వల్పంగా తగ్గాయని మండవాలి కూరగాయల మార్కెట్‌లో ప్రత్యేక కూరగాయల విక్రయదారుడు లఖన్ సింగ్ తెలిపారు. సమీప భవిష్యత్తులో టమోటా లభ్యత పెరిగే అవకాశాలు ఉన్నందున ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..

వాలంటీర్లకు ఏపీ సీఎం శుభవార్త.. త్వరలోనే రెట్టింపు కానున్న జీతాలు..

Share your comments

Subscribe Magazine