News

రేషన్‌ బియ్యం బదులు డబ్బులు ఇచ్చే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం !

Srikanth B
Srikanth B

తెల్ల రేషన్‌ కార్డు లబ్ది దారులకు బియ్యానికి బదులుగ నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. అయితే మొత్తం ఒకేసారి మొదట మే నెల నుంచి మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని అనకాపల్లి, గాజువాక జోన్లలో అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు ప్రభుత్వం నుంచి పౌర సరఫరాల శాఖకు మార్గదర్శకాలు జారీ చేశారు . జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా విపరీతంగా పెరుగుతుంది . దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం 12.82 లక్షల కుటుంబాలకు బియ్యం కార్డులు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున ప్రతి నెలా సుమారు 19 వేల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు.

కరోనా  నేపథ్యంలో 2020 ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా రెండు పర్యాయాలు బియ్యం పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూపాయి చొప్పున వసూలు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణి  చేస్తుంది . దీంతో నలుగురు సభ్యులున్న కుటుంబానికి ప్రతి నెలా 40 కిలోల బియ్యం లభిస్తుంది . జిల్లాలో దాదాపు సగానికిపైగా కుటుంబాలు రేషన్‌ బియ్యాన్ని ఉపయోగించకుండా దళారులకు అమ్ముకుంటున్నాయి. కొంతమంది దళారులు   ఇంటింటికీ వెళ్లి రేషన్‌ బియ్యం కిలో రూ.10-12కు కొనుగోలు చేస్తున్నారు.

వీటిని రైస్‌ మిల్లులకు కిలో రూ.15కు విక్రయిస్తున్నారు.  రైస్‌ మిల్లర్లు రేషన్‌ బియ్యాన్ని మరోసారి పాలిష్‌ పట్టించి బహిరంగ మార్కెట్‌ల లో విక్రయిస్తున్నారు . ఈ  ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టాలని యోచిస్తోంది. దీంతో బియ్యం బదులు నగదు ఇవ్వాలని యోచిస్తోంది .

అధికార వర్గాల సమాచారం ప్రకారం . తొలుత విశాఖ పట్టణం  పరిధిలోని అనకాపల్లి, గాజువాక లలో ఈ  నెల నుంచి దీనిని అమలు చేయనున్నది. ఇందుకు సంబంధించి ఈ నెల 23 నుంచి ఆయా వార్డుల్లో వలంటీర్లు సర్వే చేస్తారు. వీరు తెల్ల రేషన్‌ కార్డు వున్న ప్రతి ఇంటికి వెళ్లి...నగదు బదిలీ పథకం గురించి వివరిస్తారు. రేషన్‌ బియ్యం కావాలా?, నగదు కావాలా?...అని కార్డుదారులను అడిగి, వారి అభిప్రాయాలను నమోదు చేయనున్నారు . రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి VRO  తహసీల్దార్లకు అందజేస్తారు. 25వ తేదీన సమగ్ర నివేదికను  కలెక్టర్‌కు సమర్పిస్తారు. తెల్ల రేషన్  కార్డు దారులకు మాత్రమే నగదు బదిలీ వర్తిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార భద్రత పథకం కార్డుదారులైన అన్నపూర్ణ, అన్న యోజన కార్దుదారులకు ఇది వర్తించదు.

వాస్తవంగా కిలో బియ్యం కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.37 ఖర్చు చేస్తున్నది. అయితే నగదు బదిలీ పథకం కింద ఎంత మేర డబ్బులు జమ చేస్తుందో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పౌర సరఫరాల అధికారులు చెబుతున్నారు. బియ్యం తీసుకుంటారా?, లేక డబ్బులు కావాలా? అన్నది కార్డుదారులే నిర్ణయం తీసుకోవాలని, ఒక నెలలో నగదు తీసుకొని మరుసటి నెలలో బియ్యం కావాలంటే సమీప సచివాలయంలో అర్జీ పెట్టుకోవాల్సి వుంటుందని వారు చెప్పారు. నగదు తీసుకునే వారు బ్యాంకు ఖాతా వివరాలను వలంటీర్లకు ఇవ్వాల్సి వుంటుందని స్పష్టం చేశారు.


ఇదికూడా చదవండి .

రేషన్ కార్డ్ హోల్డర్ల కు త్వరలో డిజిలాకర్ సదుపాయం , 3.6 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం!

TSPSC గ్రూప్ 1 మరియు 2 ఉద్యోగాల భర్తీలో రాత పరీక్ష మార్కులు మాత్రమే పరిగణించబడతాయి!

Related Topics

AP Government Ration card

Share your comments

Subscribe Magazine