రేషన్ కార్డు లబ్దిదారులకు ఉచిత బియ్యం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే .. అయితే రేషన్ కార్డు లబ్ధిదారులు కనీస డబ్బులు చాలించాల్సి ఉంటుంది .. ఉచితం బియ్యం పంపిణి గరీబ్ కళ్యాణ్ యోజన ను నిలిపివేసి ఉచితం బియ్యంని కనీస డబ్బులకు పంపిణి చేస్తుంది .
అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. ఇప్పటిదాకా కిలో రూ.1కే అందిస్తున్న బియ్యాన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు (ఏడాది కాలం) ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
ఆహార భద్రత కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆహార భద్రత చట్టం కిందకు వచ్చే (NFSA ) కార్డుదారులందరికీ ఏడాదిపాటు ఉచిత బియ్యం అందించనున్నట్టు ప్రకటించింది.
TSPSC :1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల .. అత్యధికంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో 89 ఖాళీలు..
ఆంధ్రప్రదేశ్లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులతో సమానంగా నాన్ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఏ కార్డుదారులకు కూడా ఉచితంగా బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది . కొత్త సంవత్సరం 2023 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ శనివారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బియ్యం పంపిణీ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రేషన్ దుకాణాలు, ఎండీయూ వాహనాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ పథకం కేవలం ఒక్క బియ్యానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ 1967కు లేదా 18004250082 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు .
Share your comments