News

అమరావతి రైతు కూలీలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. అకౌంట్లలో డబ్బులు జమ

KJ Staff
KJ Staff
AMARAVATHI FARMERS
AMARAVATHI FARMERS

అమరావతి ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా పరిస్థితుల్లో ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అమరావతి ప్రాంతంలో భూములేని కుటుంబాలకు పెన్షన్లు చెల్లించాలని నిర్ణయించింది. దీని కోసం రూ.30 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు, మూడు రోజుల్లో ఈ డబ్బులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి పెన్షన్లు చెల్లించనుంది. లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేయాలని అమరావతి మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ కమిషన్ ను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అమరావతి పరిధిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రతి ఏటా ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది. అయితే భూములు రాజధానికి ఇవ్వడంతో భూమి లేకపోవడంతో కూలీ పనులు చేసుకునేవారికి ఉపాధి కరువైంది.

దీంతో భూమిలేనివారికి పెన్షన్ చెల్లించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం రూ.2,500 చొప్పున చెల్లిస్తుండగా.. జగన్ ప్రభుత్వం దానిని రూ.5 వేలకు పెంచింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 20,100 మంది భూమి లేని కూలీలకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది. భూమి ఇచ్చిన రైతలుకు కౌలు చెల్లించాలని, లేనివారికి పెన్షన్ ఇవ్వాలని సీఆర్ డీఏ చట్టంలో ఉంది. దాని ప్రకారం ప్రభుత్వం చెల్లిస్తుంది.

 

అటు రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతలుకు కౌలు చెల్లించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ కౌలు డబ్బులు ఇంకా రైతుల అకౌంట్లలో జమ కాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతోంది. త్వరలో కౌలు డబ్బులను రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేసే అవకాశముంది. ప్రభుత్వం కౌలు చెల్లించడం లేదంటూ ఇటీవల అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు రాకముందు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమరావతి రైతులకు త్వరలోనే కౌలు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఇంకా ఆ డబ్బులు జమ కాలేదు. దీంతో వాటి కోసం అమరావతి రైతులు ఎదురుచూస్తున్నారు.

Share your comments

Subscribe Magazine