News

నాసిరకం విత్తనాలు అమ్ముతున్న 22 మంది వ్యాపారులపై కేసు నమోదు !

Srikanth B
Srikanth B
నాసిరకం విత్తనాలు అమ్ముతున్న 22 మంది వ్యాపారులపై  కేసు నమోదు !
నాసిరకం విత్తనాలు అమ్ముతున్న 22 మంది వ్యాపారులపై కేసు నమోదు !

నాసిరకం విత్తనాలు, ఎరువుల విక్రయాలపై ప్రజలు, రైతుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిత్యావసరాల చట్టంలోని 6ఏ కింద మూడు క్రిమినల్‌ కేసులు సహా 22 కేసులు నమోదు చేశారు

వ్యాపారులపై కేసులు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 జిల్లాల్లో మంగళవారం నుంచి ఎరువుల దుకాణాలు, సంస్థలపై దాడులు జరగడాన్ని రైతులు స్వాగతిస్తున్నారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ శంఖ బ్రత బాగ్చి తెలిపారు.

బుధవారం 100కు పైగా విజిలెన్స్ అధికారుల బృందాలు ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర వ్యాప్తం గ వివిధ ప్రాంతాల్లో 100 పైగా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి నిత్యావసర వస్తువుల చట్టంలోని సెక్షన్ 6(ఎ) కింద 11 కేసులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారిపై ఒక క్రిమినల్ కేసు నమోదు చేశారు. రైతులు. నకిలీ విత్తనాలు, నాసిరకం రసాయనాల విక్రయాల కారణంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడంతో నష్టాలు  పాలవుతున్నారని ,. అటువంటి పరిస్థితిని నివారించడానికి, రైతులకు నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులు అందేలా మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము,” అని బాగ్చి వివరించారు.

టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా విజిలెన్స్‌కు వచ్చిన  100 ఫిర్యాదుల్లో 60  కి  పైగా వంటనూనెల ధరలు, విత్తనాలు, ఎరువుల నాణ్యతకు సంబంధించినవేనని చెప్పారు. "ఖరీఫ్ సీజన్‌కు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉంది, రైతు లకు ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మినట్లు  తెలిస్తే కట్టిన చర్యలు తప్పవని హెచ్చరించారు

వినియోగదారుల నుంచి ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలను వసూలు చేయడంపై చేపట్టిన దాడుల గురించి బాగ్చి వివరిస్తూ, లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం మొత్తం 2,689 కేసులు, ఆహార భద్రత మరియు ప్రామాణిక చట్టం, 6(ఎ)లోని నిత్యావసర వస్తువుల కింద 113 కేసులు నమోదయ్యాయి. మార్చి 6 నుంచి మే 17 వరకు నిర్వహించిన తనిఖీల్లో యాక్ట్, 18 క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

పట్టణ పేదలకు .. పట్టణ ఉపాధి హామీ పథకం ప్రతిపాదించిన ప్రధానమంత్రి ఆర్థిక సలహా సంఘం!

Share your comments

Subscribe Magazine